telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ ఐటమ్ బాంబ్ రహస్య వివాహం…!?

Rakhi-Sawanth

బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ ఎప్పుడూ వివాదాస్పద వార్తలతో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. 40 ఏళ్ళ ఈ అమ్మ‌డు ఇండియాస్‌ గాట్‌ టాలెంట్ షో కంటెస్టెంట్‌ దీపక్‌ కలాల్‌ను వివాహం చేసుకోబోతున్న‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌క‌టించి సంచలనం సృష్టించింది. కొద్ది రోజుల త‌ర్వాత మా పెళ్లి జ‌ర‌గ‌డం లేద‌ని తెల్చి చెప్పింది. వీరి వివాహం లాస్ ఏంజెల్స్ లో జరుగుతుందని కూడా పేర్కొంది. ఏమైందో ఏమో తెలియదుగాని, ఆ వివాహం జరగడం లేదని ఆ తరువాత రాఖీ సావంత్ పేర్కొంది. “నేను చాలా మంచి అమ్మాయిని. నావలన మా అమ్మ, సోదరుడు బాధపడుతున్నారు. చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను.. నేను పెళ్లి చేసుకోలేను ” అని చెప్పి అప్పట్లో తన ఇంస్టాగ్రామ్ లో రాసుకుంది. తాజాగా రాఖీ సావంత్ ఓ ఎన్నారైని ర‌హ‌స్యంగా వివాహం చేసుకుంద‌ని అనేక పుకార్లు షికారు చేశాయి. ఈ నెల 28న పెళ్ళి పీట‌లెక్కిన ఈ అమ్మ‌డికి ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ఆశీస్సులు అందించిన‌ట్టు రాశారు. దీనిపై స్పందించిన రాఖీ సావంత్ త‌న పెళ్లి వార్త‌ల‌లో నిజం లేద‌ని పేర్కొంది. ‘‘జేడబ్ల్యూ మారియట్‌లో నేను పెళ్లి షూట్‌లో పాల్గొన్నాను. అంత‌ మాత్రం దానికి నాకు పెళ్లైపోయిందని ఎందుకు ప్ర‌చారం చేస్తున్నారో నాకు అర్ధం కావ‌డం లేదు. నేను ఎవ‌రితో రిలేష‌న్‌లో లేను. ఇప్ప‌టికి సింగిల్‌గానే ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది రాఖీ సావంత్.

Related posts