telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్యాయత్నం

Bigg-Boss-3

తమిళ “బిగ్ బాస్” ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా తమిళ బిగ్ బాస్ హౌజ్ లో ఓ నటి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. ‘ఒరుకల్‌ ఒరు కన్నాడి’ సినిమాలో తన నటనతో నవ్వులు పూయించి పేరు తెచ్చుకున్న నటి మధుమిత తాజాగా తమిళంలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్-3 లో కంటిస్టెంట్ గా వెళ్లారు. దాదాపు యాభై రోజులకు పైగా హౌస్‌లో ఉన్న మధుమిత కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తోన్న సమయంలో శనివారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆమెను హౌస్ నుంచి వెంటనే బయటకు పంపించేశారు. బయటకు వచ్చిన మధుమిత ఎంతో ఆవేదనకు గురైంది. బిగ్ బాస్ హౌజ్ లో బయటకు కనిపిస్తున్నంత మంచి మనుసున్నవారు కాదని, తనను టార్గెట్ చేసుకొని దారుణంగా హింసించారని, అందువల్లే చనిపోవాలని అనిపించిందని వ్యాఖ్యానించడం గమనార్హం. హౌస్‌లో కవిన్ అలానే మిగిలిన కొందరి మధ్య జరిగిన వాదనల కారణంగా మధుమిత సూసైడ్ అటెంప్ట్ చేసింది. అయితే హోస్ట్ కమల్ హాసన్.. మధుమిత చేసిన చర్యపై మండిపడ్డారు. హౌస్‌లో మధుమిత బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా మిగిలిందని వ్యాఖ్యానించారు. కవిన్, లాస్యలతో ఏర్పడిన వివాదం.. వనిత రీ ఎంట్రీకి తర్వాత ఏర్పడిన వివాదాలే ఆమె ఆత్మహత్యాయత్నానికి దారి తీశాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కమల్ వ్యాఖ్యాతగా ఉన్న గత రెండు సీజన్లలోనూ పలు వివాదాస్పద ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.

Related posts