telugu navyamedia
సినిమా వార్తలు

కియారా అద్వానీ స్టార్ హీరో సినిమాకు “నో” చెప్పిందా ?

Kiara

తెలుగులో “భరత్ అనే నేను” చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ. ఈ భామ హిందీలో “లస్ట్ స్టోరీస్” అనే వెబ్ సిరీస్ తో తనలోని హాట్ నెస్ బయటపెట్టి యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత రామ్ చరణ్ సరసన “వినయ విధేయ రామ” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా… ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. ఇక ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన “అర్జున్ రెడ్డి ” రీమేక్ “కబీర్‌సింగ్” చిత్రంతో కెరీర్‌లో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది కియారా అద్వానీ. ప్రీతి పాత్రలో సహజనటనతో ఆకట్టుకున్నది. ఈ సక్సెస్‌తో బాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నది. ఈ చిత్రంతో హీరోయిన్ గా కియారా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్తలు విన్పించాయి. కానీ రో విజయ్ 64వ సినిమాను హీరోయిన్ సమస్య వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం “బిగిల్” సినిమాలో నటిస్తున్న విజయ్ ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా లేటెస్ట్ సెన్సేషన్ రష్మిక మందన్నాను అనుకున్నారు. రష్మిక కూడా నటించేందుకు ఆసక్తి చూపించింది. అయితే డేట్ల సమస్య కారణంగా ఆ సినిమా నుంచి రష్మిక తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో బాలీవుడ్ హీరోయిన్ కియారా అడ్వాణీని సంప్రదించారు. ఆమె కూడా ఆసక్తి చూపించినా డేట్ల అడ్జెస్ట్‌మెంట్ కారణంగానే “నో” చెప్పాల్సి వచ్చిందట. దీంతో మరో హీరోయిన్‌ను వెతికే పనిలో చిత్రబృందం బిజీగా ఉంది.

Related posts