telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వజ్రవైడూర్యాలతో.. టాయిలెట్ .. ఎవరిపిచ్చి వాళ్ళకి ఆనందం..

diamond toilet by a goldsmith

హాంకాంగ్‌లో ఓ బంగారు దుకాణాల యజమాని బంగారం, వజ్రాలతో పొదిగగిన ఒక టాయిలెట్‌ని తయారు చేయించాడు. వజ్రాభరణాల బ్రాండ్‌ కొరోనెట్‌ అనే జ్యుయెలరీ షాపు యజమాని ఆరోన్‌ షప్‌ ఒక ఆకర్షణీయమైన టాయిలెట్‌ను తయారు చేయించాడు. అవి రోటిన్‌ అనుకున్నాడేమో..దానికి వజ్రాలను పొదిగించాడు. 334.68 క్యారెట్లు బరువు ఉన్న 40,815 వజ్రాలతో దానిని తయారు చేయించాడు. దాని మొత్తం విలువ 1.3 మిలియన్‌ డాలర్లు కాగా, భారత కరెన్సీలో రూ.9 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.

ఈ వజ్రఖచిత శౌచాలయ పీఠాన్ని చైనాలోని షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రదర్శించారు. దీనిని అమ్మడానికి కాదని చెప్పిన ఆరోన్‌ షప్‌..కేవలం తనకు వచ్చిన ఐడియాను ఇంప్లిమెంట్‌ చేశానని, ఇది తన ఆసక్తి మాత్రమే అని వెల్లడించారు. ఈ బంగారు, వజ్రాలు పొదిగిన టాయిలెట్‌ మాత్రం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో కూడా ఇలాగే ఒక ధనవంతుడు బంగారంతో టాయిలెట్ చేయించుకున్న విషయం తెలిసిందే.

Related posts