telugu navyamedia
సినిమా వార్తలు

విడాకులు తీసుకోబోతున్న బాలీవుడ్ హీరోయిన్

Dia

బాలీవుడ్ లో కొంతమంది సెలెబ్రిటీల లవ్, బ్రేకప్… మరికొంతమంది సెలెబ్రిటీలు పెళ్ళి తరువాత విడాకులు తీసుకోవడం అనేది సాధారణ విషయంగా మారింది. తాజాగా బాలీవుడ్ లో మరో హీరోయిన్ తన భర్తతో విడాకులు తీసుకోబోతోంది. హైదరాబాదీ భామ, సీనియర్ హీరోయిన్ దియా మీర్జా స్వయంగా భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ప్రముఖ వ్యాపారవేత్త సాహిల్‌ సంఘాతో 11 ఏళ్ళు ప్రేమాయణం సాగించిన దియా 2014లో వివాహం చేసుకుంది. అయితే వివాహం చేసుకుని ఐదేళ్లు కూడా పూర్తవకముందే వీరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ జంటకు పిల్లలు లేరు. “మేమిద్దరం గత పదకొండేళ్లుగా కలిసున్నాం. ఒకరి కష్టసుఖాలను మరొకరం పంచుకున్నాం. ఇప్పుడు విడిపోయాలని నిర్ణయించుకున్నాం. మా ప్రయాణాలు విభిన్న మార్గాలను ఎంచుకున్నాయి. విడిపోయినా మేం ఎప్పటిలా స్నేహితులుగానే ఉంటాం. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు మా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మీడియాకు ధన్యవాదాలు. ఈ సమయంలో మాకు కాస్త ప్రైవసీని కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఇక, ఈ విషయం గురించి నేను ఎలాంటి కామెంట్లు చేయదలచుకోలేదు. ధన్యవాదాలు” అని దియా పేర్కొంది.

Related posts