telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ప్రాక్టీస్ ప్రారంభించిన .. ధోనీ …

dhoni started his practice for

మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్న ధోని కి అభిమానగణం ఎక్కువే. అతడి ఆట తీరు అలాంటిది మరి. వికెట్ కీపర్గా టీమిండియాకు ఏంట్రీ ఇచ్చిన మహేంద్రసింగ్ ధోని ఆ తర్వాత స్టార్ బ్యాట్స్ మెన్ గా మారిపోయాడు… ఇక ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ గా మారిపోయి టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలను అందించాడు మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని. అప్పటివరకు టీమిండియాకు అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచ కప్ ని సైతం రెండు సార్లు అందించారు మహేంద్రసింగ్ ధోని. టీమిండియాకు ఎన్నో అరుదైన విజయాలు అందించారు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. తన వ్యూహాలు ప్రణాళికలతో ఓడిపోయే మ్యాచ్ ను కూడా విజయతీరాలకు చేర్చగల సత్తా ధోని సొంతం. ఒక్కసారి ధోనీ మైదానంలోకి అడుగు పెట్టాడు అంటే అభిమానుల్లో కరెంటు పాస్ అయిపోతుంది. ఇక ధోని బ్యాట్ జులిపిస్తే పరుగుల వరద పారాయాల్సిందే . సొగసైన సిక్స్ లతో బాల్ ని గాల్లోనే ఉంచుతాడు మహేంద్రసింగ్ ధోని. ఇక ధోనీ ఉన్నాడంటే విజయం ఖాయమనే భావన ఇండియన్ క్రికెట్ ప్రేక్షకుల్లో ఉంటుంది. ధోని అవుట్ అవ్వకుండా గ్రీస్ లో ఉన్నాడు అంటే చాలు… ఇండియా గెలిచేస్తుందిలే అనుకుంటారు క్రికెట్ ప్రేక్షకులు.

గత కొంత కాలంగా ధోని ఆట అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. ధోని స్థాయిలో ప్రస్తుతం ఆట కనిపించడం లేదు. ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా పేలవ ప్రదర్శన చేస్తున్నారు ధోని. దీంతో గత కొన్ని రోజులుగా ధోనీ రిటైర్మెంట్ పై కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా మొన్న జరిగిన ప్రపంచకప్ నుంచి ధోని క్రికెట్ కు దూరంగానే ఉన్నారు. దీంతో క్రికెట్ అభిమానులు ధోని ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానుల కోరిక తీరే సమయం వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ధోని రి ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయిన తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా క్రికెట్ కు దూరంగా ఉన్న మహేంద్రసింగ్ ధోని తాజాగా ఝార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం లో ఈరోజు ప్రాక్టీస్ చేశారు మహేంద్రసింగ్ ధోని. ఈ క్రమంలో డిసెంబర్ లో జరగబోయే వెస్టిండీస్ తో జరగబోయే సిరీస్లో ధోనీ అందుబాటులో ఉంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక దీని పై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

Related posts