telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సినిమా అడ్డుకోవడానికి సుప్రింకోర్టు వరకు వెళ్తాం : దిశా తండ్రి

Disha

రాంగోపాల్ వర్మ పై దిశా తండ్రి శ్రీధర్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దిశ కథతో రాంగోపాల్ వర్మ తీస్తున్న సినిమా పై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశామని… అసభ్యకరంగా సినిమాను తీశారని మండిపడ్డారు. యూట్యూబ్ లో విడుదల చేసిన ట్రైలర్ ను తొలగించడంతో పాటు సినిమా విడుదల ఆపాలంటూ పిటీషన్ వేశామన్నారు. హైకోర్టు సింగిల్‌ బెంచ్, సెన్సార్ బోర్డుకు సీనిమా పై పలు సూచనలు చేసిందని పేర్కొన్నారు. దీంతో హైకోర్టు డివిజనల్ బెంచ్ లో మరోసారి పిటీషన్ దాఖలు చేశామని.. సినిమా విడుదలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపి వేయాలని అగహించారు. సినిమా విడుదల ను అడ్డుకోవడానికి సుప్రింకోర్టు వరకు వెళ్తామని హెచ్చరించారు. ఒకవేళ సినిమాను రిలీజ్ చేస్తే ఆర్జీవి పై పరువు నష్టం దావా వేస్తామని పేర్కొన్నారు. నిందితుల కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళన పై తాను స్పందించనని తెలిపారు దిశా తండ్రి శ్రీధర్ రెడ్డి.

Related posts