telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సిక్స్ ప్యాక్ లుక్ లో ధనుష్

కోలీవుడ్‌ హీరో ధనుష్‌కు టాలీవుడ్లోనూ అభిమానులను ఉన్నారు. నటనతో ప్రేక్షకులను ఆయన ఆకట్టుకుంటున్నారు. గతంలో మారి 2 చిత్రం కోసం ఆయన చేసిన వర్కవుట్స్‌ వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది. ఆ చిత్రం క్లైమ్యాక్స్‌లో ధనుష్‌ సిక్స్‌ప్యాక్స్‌తో ఫైట్‌ సీన్‌లో కనిపిస్తాడు. ఆ సన్నివేశంలో సిక్స్‌ప్యాక్స్‌లో కనిపించి అభిమానులను అలరించాడు. ఆ సిక్స్‌ప్యాక్స్‌ కోసం ధనుష్‌ ఎంత కష్టపడ్డాడో తెలియజేస్తూ అతని అభిమానులు ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆ 30 సెకన్ల వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం ధనుష్ చేతిలో నాన్ రుద్రన్ చిత్రంతో పాటు పలు చిత్రాలు ఉన్నాయి. నాన్ రుద్రన్ చిత్రానికి స్వయంగా ఆయనే దర్శకత్వం వహించబోతున్నాడు.

Related posts