telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

గ్రేటర్ ప్రచారంలో పాల్గొన వారికీ షాక్…

మన రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు వందల్లో నమోదవుతున్నాయి. నాలుగు నెలలుగా 1 శాతం పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయని డీహెచ్ శ్రీనివాస్ రావు అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 96.03 శాతం కరోనా రికవరీ  నమోదు అవుతోందని, అలాగే బెడ్ ఆక్యుపెన్సీ  11.09 శాతం మాత్రమే ఉందని అన్నారు. సెకండ్ వేవ్ పై వైద్య శాఖ అప్రమత్తంగా ఉందని, పరిస్థితులు చూస్తుంటే, తెలంగాణలో కూడా సెకండ్ వేవ్ రావచ్చని ఆయన అన్నారు. మిగతా రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ కూడా మినహాయింపు కాక పోవచ్చు అని ఆయన అన్నారు. ఎన్నికల సందర్భంగా మాస్ గ్యాదరింగ్స్ ఎక్కువ జరిగాయన్న ఆయన  ఎన్నికల సమయంలో ప్రచారంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు 5 నుంచి 7 రోజులు ఐసోలేషన్ లో ఉండాలని అన్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల తర్వాత కేసులు పెరిగే అవకాశం ఉందని, అందుకే  ప్రచారంలో పాల్గొన్న నాయకులు.. కార్యకర్తలు ఐసోలేషన్ లో ఉండాలని అన్నారు. వ్యాక్సిన్ వచ్చినా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. కరోనా పరీక్షల సమాచారం కోసం..04024651119 కాల్ చేయలాని కోరిన ఆయన కరోనా విషయంలో డిసెంబర్ , జనవరి నెలల్లో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Related posts