telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మళ్ళీ తెరపైకి .. శ్రీదేవి మృతి కేసు.. హత్యే అంటున్న డీజీపీ …

sridevi first death anniversary venue is chennai

వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి నాలుగు సినిమా ఇండస్ట్రీలను రెండు దశాబ్దాల పాటు ఏలింది. ఆమె ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటించింది.. బాలయ్యతోనూ స్టెప్పులేసింది.. ఏఎన్నార్‌తో రొమాన్స్ చేసింది.. నాగార్జునతోనూ ఆడిపాడింది. కాని పెళ్లి కోసమని దుబాయ్‌కి వెళ్లి అక్కడి హోటల్‌లోని బాత్ టబ్‌లో మునిగి శ్రీదేవి హఠాన్మరణం చెందింది. ఆమె మరణం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఇప్పటికి ఆమె మరణవార్తని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. భౌతికంగా ఆమె ఈ లోకాన్ని వీడినా నటిగా శ్రీదేవి ముద్ర చిత్ర సీమలో సుస్థిరం. ఫిబ్రవరి 24, 2018న శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మరణం అభిమానులని కొద్ది రోజుల పాటు కోలుకోనివ్వకుండా చేసింది. ఇంకా ఆమె మరణంపై అనేక ప్రచారాలు జరగగా అభిమానులు వాటిని జీర్ణించుకోలేకపోయారు. బాత్ టబ్‌లో పడి శ్రీదేవి చనిపోలేదని, ఎవరో హత్య చేసారని కొందరు ఆరోపించారు. వాటిలో ఎలాంటి నిజం లేదని కొందరు కొట్టిపాడేశారు.

ఆమె మద్యం మత్తులో బాత్ టబ్‌లో పడి మునిగి చనిపోయిందని డాక్టర్లు తేల్చడం, దుబాయ్ పోలీసులు కూడా అదే వివరాలను నమోదు చేసుకుని కేసు క్లోజ్ చేయడంతో ఈ విషయం ప్రశ్నార్ధంకంగానే మిగిలింది. అయితే తాజాగా కేరళకి చెందిన జైళ్ళ శాఖ డీజీపీ రిషి రాజ్ సింగ్.. శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి చనిపోలేదని, హత్య చేయబడిందని వ్యాఖ్యానించారు. కేరళకి చెందిన కౌముది అనే పత్రిక ఆయన వ్యాఖ్యలని కథనంగా ప్రచురించడంతో ఇది సంచలనంగా మారింది. తన ఫ్రెండ్‌, ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ ఉమాదతన్ శ్రీదేవి మరణం గురించి నాతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. శ్రీదేవి హత్య చేయబడిందని నా ఫ్రెండ్ నాతో చెప్పడంతో దానిపై ఆరా తీసాను. కొన్ని కీలక ఆధారాలని బట్టి చూస్తుంటే ఆమెది యాక్సిడెంటల్ డెత్ కానే కాదు. కావాలనే ఎవరో మర్డర్ చేసారని క్లియర్‌గా అర్ధమవుతుందని డీజీపీ రిషి రాజ్‌సింగ్ పేర్కొన్నారు.

శ్రీదేవి ఒకవేళ అతిగా మద్యం తాగినప్పటికి ఒక అడుగు ఉన్న బాత్‌టబ్‌లో పడి చనిపోయే అవకాశమే లేదు. ఎవరో వెనుక నుండి తోసి చంపేసి ఉంటారు. ఒక వ్యక్తి అడుగులోతు ఉన్న బాత్‌టబ్‌లో పడి చనిపోవటం అసాధ్యం .డాక్టర్ ఉమాదతన్ ఒక ఫోరెన్సిక్ సర్జన్. చాలా ముఖ్యమైన కేసులు డీల్ చేశాడు. అతడితో కలిసి నేను కూడా చాలా కేసులకు పని చేశాను అని రిషిరాజ్ సింగ్ వెల్లడించారు. అతిలోక సుందరి శ్రీదేవిపై రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఒమన్ దేశంలో ఉందని, దుబాయ్‌లో మరణిస్తేనే ఆ ఇన్యూరెన్స్ పాలసీ ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశం ఉందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. మరి తాజాగా పోలీసు అధికారి చేసిన సంచలన వ్యాఖ్యలపై శ్రీదేవి కుటుంబ సభ్యులు ఏమైన స్పందిస్తారేమో చూడాలి.

Related posts