telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

100, 112 నంబర్లపై పోలీసుల విస్తృత ప్రచారం

apcm jagan give full powers to gowtam as dgp

దేశవ్యాప్తంగా కలకలం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్య ఘటన అనంతరం ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆపదలో ఉన్న వేళ, పోలీసులను సంప్రదించాల్సిన 100, 112 ఫోన్ నంబర్లపై పోలీసులు ప్రచారం ప్రారంభించారు. తమ సహాయం కావాల్సి వస్తే వెంటనే సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఇక పోలీసులు తక్షణం స్పందిస్తారా? ఈ సందేహం ఒకరు, ఇద్దరికి కాదు. ఏకంగా 40 వేల మందికి వచ్చింది. ఆదివారం ఒక్కరోజే 40 వేల మంది 112 నంబరుకు ఫోన్ చేసి పలు రకాల సహాయాలను కోరడం గమనార్హం. వారిలో అత్యధికులు పోలీసులు సకాలంలో స్పందింస్తున్నారని నిర్దారించుకున్నారు. ఇక పోలీసు మొబైల్ యాప్ ను సైతం 30 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

ఇదిలావుండగా, ఏపీలోని వాట్స్ యాప్ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న 9969777888 నంబరు పోలీసులది కాదని డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు. పోలీసు శాఖ పేరిట ప్రచారం అవుతున్న ఈ నంబర్ ను తాము ఇవ్వలేదని, దీన్ని వైరల్ చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఏపీలో పోలీసుల వద్ద 9121211100 వాట్స్ యాప్ నంబర్ ఉందని ఆయన స్పష్టం చేశారు. 100, 112లతో పాటు 181 నంబర్ ను కూడా మహిళలు వినియోగించుకోవచ్చని తెలిపారు.

Related posts