telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా కల సగం నెరవేరినట్లే… లెగసీ ఫ్రమ్ అన్నయ్య ఆల్బమ్ : దేవిశ్రీ ప్రసాద్

Devisri

ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తన కల నెరవేరిందని తెలుపుతూ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది. “మాండలిన్‌ శ్రీనివాస్‌ గారిని కంపోజిషన్‌ చేయాలని అనుకున్నప్పటికీ ఆయనపై ఉన్న గౌరవంతో ఎప్పుడూ అడిగే ధైర్యం చేయలేదు. ఒకవేళ అడిగి ఉంటే ఒప్పుకునే వారేమోనని ఇప్పుడు అనిపిస్తుంది. ఆయన పరమపదించిన తర్వాత ఇటీవల ఆయన సోలో మాండలిన్ ట్రాక్ విన్నాను. దీంతో ఆ ట్రాక్‌లోని కొంత భాగాన్ని ఆర్కెస్ట్రా చేసి నా గురువుకు అంకితమివ్వాలని అనుకున్నాను. శ్రీనివాస్‌ గారి సోదరుడు రాజేశ్‌ గారికి నా కోరిక చెప్పగానే ఆయన ఒప్పుకుని ఆ ట్రాక్‌ ఇచ్చారు. గురువు గారి కంపోజిషన్‌కు శిష్యుడినైన తాను ఆర్కెస్ట్రా ఇవ్వడంతో నా కల సగం నెరవేరినట్లే. లెగసీ ఫ్రమ్ అన్నయ్య ఆల్బమ్” అంటూ తన కంపోజింగ్‌ను దేవీశ్రీ ప్రసాద్ యూట్యూబ్‌ ద్వారా విడుదల చేశారు. మొత్తానికి తన గురువు మాండలిన్ శ్రీనివాస్‌తో కలిసి సాంగ్ కంపోజ్ చేయాలని ఎన్నాళ్లుగానో అనుకుంటున్న దేవిశ్రీ కల నెరవేరిందన్నమాట.

Related posts