telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నాయకుల కనుసన్నల్లో అధికారులు తప్పు చేశారు: దేవినేని

devineni on power supply

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల పై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలు ఎంపీటీసీలుగా లేని చోట బీసీలకు రిజర్వ్ చేయడం కుట్ర అని అరోపించారు. కొంతమంది నాయకుల కనుసన్నల్లో అధికారులు తప్పు చేశారని ఆరోపించారు. “కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం బీసీ మహిళకు రిజర్వ్ అయింది కానీ ఎంపీటీసీ బీసీ మహిళ లేదు. నెల్లూరు జిల్లాలో 16 మండలాల్లో ఒక్క ఎంపీటీసీ కూడా బీసీ లేరు. కృష్ణా జిల్లాలో 6 మండలాల్లో 3 మండలాలకు బీసీ పురుషులు లేరు, 3 మండలాలకు బీసీ మహిళలు లేరు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో 30 ఎంపీటీసీల్లో ఒక్క బీసీ సోదరుడు కానీ ఒక్క బీసీ సోదరి కానీ లేరు.

జగన్ బడుగు, బలహీన వర్గాల వారి గొంతునొక్కే కార్యక్రమం చేస్తున్నారు. తన నవరత్నాలు, తన 10 నెలల పాలన గెలిపిస్తుందని జగన్ చెప్పడంలేదు. మీమీ ప్రాంతాల్లో ఓడితే నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామాలు చేయండని మంత్రులకు సుభాషితాలు చెబుతున్నారు. దీని ద్వారా వైసీపీ వాళ్లు ఓటమిని ఒప్పుకున్నట్టయింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు.

Related posts