telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ ప్రభుత్వానికి ఎప్పుడూ చంద్రబాబు ఇల్లు ముంచాలనే తపనే..

Devineni-uma

ఏపీని భారీ వర్షాలు కుదిపేసిన విషయం తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో..నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం, పేరకలపాడు గ్రామంలో ముంపుకు గురైన పంటపొలాలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, రైతులతో కలసి దేవినేని ఉమా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..దేవినేని ఉమా మాట్లాడుతూ..ముఖ్యమంత్రి జగన్ గారికి నెలరోజుల తర్వాత ఏరియల్ సర్వే గుర్తుకొచ్చిందని వరదలు వచ్చిన ప్రతిసారి ప్రభుత్వానికి ఎప్పుడూ చంద్రబాబు ఇల్లు ముంచాలనే తపన ఉందని ఫైర్ అయ్యారు దేవినేని ఉమా. ఒక్క కృష్ణాజిల్లాలోనే 32 మండలాలు ప్రభావితమై పెద్ద ఎత్తున నష్టం జరిగిందని.. సున్నా వడ్డీకి ” సున్నా” పెట్టారని మండిపడ్డారు. రైతు భరోసాలోను అన్నదాతలను మోసం చేస్తున్నారని వరుస వరదల వల్ల రైతాంగ మొత్తం దిక్కుతోచని స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటపొలాలు నీట మునిగి రైతన్నలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని.. గత వరదకు నష్టపోయిన రైతులకు ఇంకా పరిహారమే ఇవ్వలేదని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు దేవినేని ఉమా.

Related posts