telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బందర్ పోర్టుని తెలంగాణకు ఎంతకు అమ్మేశారు: ప్రశ్నించిన దేవిదేని

uma devineni

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బందరు పోర్టు పనులు చేసే యంత్రాలు వెనక్కి వెళ్లిపోయాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. బందర్ పోర్టుని తెలంగాణ ప్రభుత్వానికి ఎంతకు అమ్మేశారంటూ దేవినేని ప్రశ్నించారు.

జగన్ ప్రభుత్వం క్విడ్ ప్రోకో ద్వారా తెలంగాణకు ఇచ్చేసిందని విమర్శించారు. తమపై పదేపదే ట్వీట్లు పెట్టే విజయసాయి రెడ్డి ఇటీ వల జరిగిన నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు గురించి ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నించారు. బెయిల్‌పై తిరుగుతున్న ఆయన తమను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బందరు పోర్ట్ పై సీఎం జగన్ ప్రకటన చెయ్యాలని డిమాండ్‌ చేశారు. బందరు పోర్టుపై ప్రభుత్వం ఇచ్చిన రహస్య జీవోలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.

Related posts