telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జైలు అధికారులపై దేవినేని ఉమ ఫైర్

devineni on power supply

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై ఓ హత్య కేసులో కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనను ఏ4గా పేర్కొన్నారు దీంతో, ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు, జైల్లో ఉన్న ఆయనను కలిసేందుకు టీడీపీ నేతలు దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు వెళ్లారు. రవీంద్రను కలిసేందుకు వీరికి జైలు అధికారులు అనుమతిని ఇవ్వలేదు. కరోనా నేపథ్యంలో మిలాఖత్ కు అనుమతి లేదని అధికారులు చెప్పారు. దీంతో, టీడీపీ నేతలు జైలు బయట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్లకార్డులు చేతపట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ, రవీంద్రను జైల్లో పెట్టినప్పుడు అధికారులకు కరోనా గుర్తుకు రాలేదని… పరామర్శించేందుకు తాము వచ్చినప్పుడు మాత్రం కరోనా అంటున్నారని మండిపడ్డారు. ఒక పథకం ప్రకారమే కొల్లు రవీంద్రపై అక్రమ కేసు నమోదు చేశారని మండిపడ్డారు.

Related posts