telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

అడిలైడ్‌ : … మళ్ళీ చెలరేగిన .. డేవిడ్‌ వార్నర్‌…

devid warn century on pakistan

ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (166 బ్యాటింగ్‌; 228 బంతుల్లో 19×4) జోరుమీదున్నాడు. చాన్నాళ్ల తర్వాత ఫామ్‌ అందుకున్న అతడు కసితీరా ఆడుతున్నాడు. పాకిస్థాన్‌పై వరుసగా రెండో శతకం బాదేశాడు. అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న డే/నైట్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం సాధించాడు. అతడికి తోడుగా లబుషేన్‌ (126 బ్యాటింగ్‌; 205 బంతుల్లో 17×4) సైతం సెంచరీ కొట్టేశాడు. ప్రత్యర్థిపై అతడికీ ఇది వరుసగా రెండో శతకం కావడం గమనార్హం. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 294 (421 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం అందించడంతో తొలి రోజు ఆటముగిసే సరికి ఆసీస్‌ 302/1తో నిలిచింది. ఓపెనర్‌ జో బర్న్స్‌ (4)ను జట్టు స్కోరు 8 వద్ద షాహీన్‌ అఫ్రిది పెవిలియన్‌ పంపించాడు.

వర్షం కారణంగా ఒక సెషన్‌ సమయం వృథా అయింది. ఆట మొదలైన తర్వాత వార్నర్‌ పాక్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. తొలుత ఆచితూచి ఆడిన అతడు క్రీజులో కుదురుకున్న తర్వాత విజృంభించి ఆడాడు. అందివచ్చిన బంతుల్ని అలవోకగా బౌండరీ సరిహద్దు దాటించాడు. యాసిర్‌ షా వేసిన 51.2వ బంతికి సింగిల్‌తో టెస్టుల్లో 23, అడిలైడ్‌లో 4, స్వదేశంలో 17, పాక్‌ ఐదో శతకం అందుకున్నాడు. ఆసీస్‌ తరఫున టెస్టుల్లో అతి ఎక్కువ శతకాలు చేసిన రెండో ఓపెనర్‌ వార్నరే. మాథ్యూ హెడేన్‌ (30) ముందున్నాడు. మార్క్‌ టేలర్‌ (19), జస్టిన్‌ లాంగర్‌ (16) అతడి తర్వాతి స్థానాల్లో నిలిచారు. టెస్టుల్లో ఓపెనర్‌గా అత్యధిక శతకాలు చేసిన వారి జాబితాలో అతడిది ఐదో స్థానం. సునీల్‌ గావస్కర్‌ (33), అలిస్టర్‌ కుక్‌ (31), హెడేన్‌ (30), గ్రేమ్‌ స్మిత్‌ (27) ముందున్నారు.

Related posts