telugu navyamedia
సినిమా వార్తలు

మేనల్లుడి మ్యూజిక్ కు ఫిదా అయిన రాక్ స్టార్

Devi-Sri-PRasad

రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ తన మ్యూజిక్ తో సంగీత ప్రియులను ఫిదా చేస్తుంటారు. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న సంగీత సార‌థ్యంలో రూపొందిన చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అయ్యాయి. అయితే తాజాగా ఈ రాక్ స్టారే త‌న మేన‌ల్లుడు వాయించిన ద‌రువుకి ఫిదా అయ్యాడ‌ట‌. వెంట‌నే త‌న మేన‌ల్లుడు దరువు వాయిస్తున్న వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. “నా మేన‌ల్లుడు తాన‌వ్ స‌త్యకి సంగీతం ఎవ‌రూ నేర్పించ‌లేదు. వాడంత‌ట వాడే నేర్చుకుంటున్నాడు. నెల‌ల బాబుగా ఉన్న‌ప్ప‌టి నుండే ద‌రువు వేస్తున్నాడు. వాడి వ‌య‌స్సు రెండున్న‌ర ఏళ్ళు. ప్ర‌స్తుతం వాడు జూనియ‌ర్ రాక్ స్టార్‌లా మారాడు. ఇది మా నాన్న ఆశీర్వాదంతోనే జరుగుతుంది” అంటూ ట్వీట్ చేశారు దేవి శ్రీ ప్రసాద్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

Related posts