telugu navyamedia
news political

మహారాష్ట్ర సీఎం ఏడున్నర లక్షలు వాటర్‌ బిల్లు చెల్లించాలట!

Fadnavis cm maharashtra

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఏకంగా ఏడున్నర లక్షల రూపాయల వాటర్‌ బిల్లు చెల్లించాల్సి ఉందట. ఈ విషయాన్ని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) వెల్లడించింది. ముఖ్యమంత్రితో పాటు మరో 18 మంది మంత్రులను ఎగవేతదారులుగా ప్రకటించింది. షకీల్‌ అహ్మద్‌ అనే సామాజక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన దరఖాస్తుకు బీఎంసీ ఈ మేరకు సమాధానమిచ్చింది.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ అధిరారిక నివాసం ‘వర్షా’ బంగ్లాకు ఏడు కనెక్షన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ బిల్డింగ్‌ పేరు మీద దాదాపు 7,44,891 రూపాయల వాటర్‌ బిల్లు బకాయి పడ్డట్లు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది.ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సుధీర్‌ ముంగతివార్‌, పంకజా ముండే, రామ్‌దాస్‌ కదమ్‌ సహా 18 మంది మంత్రుల పేర్లను కూడా ఎగవేతదారుల జాబితాలో చేర్చినట్లు బీఎంసీ తెలిపింది.

Related posts

ప్రతిపక్షనేతగా తనవంతు సహకారం.. జగన్ కు చంద్రబాబు లేఖ

vimala p

జగన్ అమెరికా పర్యటనపై కన్నా ఫైర్

vimala p

23 తర్వాత ఏపీ పౌరుషం ఏంటో  తెలుస్తుంది: యామిని

vimala p