telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ శానిటరీ క్లీనర్ డెటాల్ కు కరోనా గురించి ముందే తెలుసా ?

dettol

నోవెల్ కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల మంది అస్వస్థతకు గురికాగా… దాదాపు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.  సాధారణంగా వచ్చే జలుబు నుంచి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్-సీవోవీ), సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్-సీవోవీ) వంటి తీవ్రమైన వ్యాధుల వరకు కారణమయ్యే ఓ పెద్ద వైరస్‌‌ల జాతి కుటుంబమే ఈ కరోనా వైరస్‌లు అని  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. అయితే ప్రముఖ శానిటరీ క్లీనర్ డెటాల్ లేబుల్‌పై ‘‘ఈ.కోలి, సాల్మొనెల్లా, ఎంఆర్ఎస్ఏ, రోటావైరస్, ఫ్లూ వైరస్, కోల్డ్ వైరస్‌లు (హ్యూమన్ కరోనా వైరస్, ఆర్ఎస్‌వీ) వంటి వాటిని చంపగలదు..’’ అని ఆ లేబుల్‌పై రాసి ఉంది. దీన్ని చూడగానే చాలామంది నెటిజన్లు అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన ఫేక్ న్యూస్ విపరీతంగా వైరల్ కావడంతో దీనిపై డైటాల్ ఉత్పత్తుల సంస్థ రెకిట్ బెంకిజర్ గ్రూప్ (ఆర్‌బీ) ఫేస్‌బుక్ వేదికగా వివరణ ఇచ్చింది. ‘‘ఇతర ఉత్పత్తిదారుల మాదిరిగానే ఆర్‌బీకి కూడా కొత్త వైరస్ (2019-నోవెల్ కరోనా వైరస్)పై ఇంకా పరీక్షలు జరిపే అవకాశం రాలేదు. దీని కారణంగా మా ఉత్పత్తులు ఈ కొత్త వైరస్‌‌పై ఎంత ప్రభావం చూపిస్తాయో కచ్చితంగా నిర్ధారించలేం. అయితే మెర్స్-కరోనా వైరస్, సార్స్-కరోనా వైరస్ వంటి ఇతర కరోనా వైరస్‌లపై మా ఉత్పత్తులను పరీక్షించి, వాటిని చంపుతున్నట్టు గుర్తించాం. నోవెల్ కరోనా వైరస్-2019 కొత్తగా వచ్చినప్పటికీ.. ఇది కూడా చాలామట్టుకు మిగతా కరోనా వైరస్‌ల వంటిదే..’’ అని ఆర్‌బీ సంస్థ పేర్కొంది.

Related posts