రాజకీయ వార్తలు

నిర్ణ‌యాధికారమే టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయ‌మా…???

kcr public meeting schedule released
నిజామాబాద్, న‌ల్గొండ‌, వ‌న‌ప‌ర్తి ప్ర‌జాఆశీర్వాద స‌భ‌ల్లో మ‌హాకూట‌మిపైనా, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపైనా తిట్ల వ‌ర్షం కురిపించే క్ర‌మంలో తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌దే ప‌దే ఓ విష‌యం ప్ర‌స్తావించారు. సుదీర్ఘ‌కాలం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ‌ను మ‌ళ్లీ ఆంధ్రోళ్ల‌కి లేదంటే ఢిల్లీకి అప్ప‌గిస్తామా….? 
నిర్ణ‌యాధికారాన్ని తెలంగాణ చేతుల్లోనే ఉంచుకుందామా లేక ఢిల్లీ, అమ‌రావ‌తి పాల‌కుల‌కు అప్ప‌జెబ్దామా…? అని కేసీఆర్ ప‌దే ప‌దే రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. తాను త‌ప్ప ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా తెలంగాణకు స్వ‌యం నిర్ణ‌యాధికారం ఉండ‌ద‌ని ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించ‌డం ఈ ప్ర‌శ్న వెన‌క ఉద్దేశం. కాంగ్రెస్ హైక‌మాండ్ ఢిల్లీలో ఉంటుంది కాబ‌ట్టి ఒక‌వేళ మ‌హాకూట‌మి అధికారంలోకి వ‌స్తే కీల‌క నిర్ణ‌యాల‌న్నీ హ‌స్తిన‌లోనే జ‌రిగే అవ‌కాశ‌ముంటుంది. లేదంటే కూట‌మిని తెర వెన‌క అంతా తానై న‌డిపిస్తున్నార‌ని కేసీఆర్ అనుమానిస్తున్న చంద్ర‌బాబు చేతుల్లోకి వెళ్తుంది. అంటే అమ‌రావ‌తి అధిష్టానంగా మారుతుంది. ఆత్మ‌గౌర‌వ నినాదంతో ఆవిర్భ‌వించిన తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స‌హ‌జంగానే ఇది రుచించ‌దు. అందుకే కేసీఆర్ ప‌లుమార్లు ప్రాంతీయ సెంటిమెంట్ ను ప్ర‌యోగిస్తున్నారు. ఎన్నో త్యాగాల త‌ర్వాత ఏర్ప‌డ్డ తెలంగాణ‌లో ఆకాంక్ష‌లు అనేకం నెర‌వేర‌నప్ప‌టికీ…కేసీఆర్ పై ప్ర‌జ‌ల్లో అభిమానం త‌గ్గ‌క‌పోవ‌డానికి ఉద్య‌మ‌నేత‌గా సాధించిన విజ‌యాలే కాకుండా, తొలిముఖ్య‌మంత్రిగా రాష్ట్రాన్ని స‌ర్వ‌స‌త్తాక స్వ‌తంత్ర రాజ్యం త‌ర‌హాలో న‌డిపించిన విధాన‌మే కార‌ణం. ఎవ‌రు ఔన‌న్నా, కాద‌న్నా కేసీఆర్ తెలంగాణ‌లో ఓ ప్ర‌త్యేక త‌ర‌హా పాల‌న సాగించార‌న్న‌ది నిజం.
TRS Party KCR trying One More Sabha in Siddipet
తెలంగాణ దేశంలో భాగమైన‌ప్ప‌టికీ….అంతిమంగా కేసీఆర్ అనుకున్న‌దే రాష్ట్రంలో జ‌రిగింది. జోన‌ల్ విధానం, ముంద‌స్తు ఎన్నిక‌లు వంటివి ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్పొచ్చు. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను ఆత్మ‌గౌర‌వ‌రాష్ట్రంగా నిలిపారు కేసీఆర్. ఇది సాధ్య‌మైంది ఆయ‌న తెలంగాణ‌కే ప‌రిమిత‌మైన ప్రాంతీయ పార్టీ నాయ‌కుడు కావ‌డం వ‌ల్లే. కేసీఆర్  కాంగ్రెస్ కో, బీజేపీకో క‌నీసం టీడీపీకో చెంది ఉంటే స్వేచ్ఛ‌, సార్వ‌భౌమ‌త్వాలు ఈ స్థాయిలో ఉండేవికాద‌న్న‌ది నిజం. జాతీయ ప‌రిమితులు లేని ప్రాంతీయ పార్టీల‌కు ఉండే స్వేచ్ఛతో నాలుగున్న‌రేళ్ల కాలంలో స‌ర్వం తానే అయి వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా కేసీఆర్ సొంత‌పాల‌న‌లో ఉండే సౌఖ్యాన్ని ప్ర‌జ‌ల‌కు అందించారు. మ‌రి దీనికి అల‌వాటు ప‌ట్ట తెలంగాణ ప్ర‌జ‌లు మ‌హాకూట‌మిని ఆద‌రిస్తారా అన్న‌ది అంద‌ర‌కీ క‌లుగుతున్న సందేహం. కేసీఆర్ చెప్పిన‌ట్టుగా ఒక‌వేళ మ‌హాకూట‌మి అధికారంలోకి వ‌స్తే నిర్ణ‌యాల‌న్నీ ఢిల్లీలోనో, అమ‌రావ‌తిలోనో జ‌రుగుతాయ‌నేది అంద‌రూ అంగీక‌రించేదే. ధైర్య‌వంతుడిగా, సాహ‌స‌వంతుడిగా, ఎవ‌రికీ త‌ల‌వంచ‌ను అన్న‌ట్టుగా ఉండే కేసీఆర్ ను ముఖ్య‌మంత్రిగా చూసిన ప్ర‌జ‌లు ప్ర‌తి ప‌నికీ పోయిరావ‌లె హ‌స్తిన‌కు అన్న‌టుగా ఉండే కాంగ్రెస్ నేత‌ల వైఖ‌రిని ఇష్ట‌ప‌డ‌లేరు. త‌మ‌ను పాలిస్తున్న నేత‌లు ఢిల్లీలో అధిష్టానం అపాయింట్ మెంట్ల‌కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూడ‌డం అల‌వాటులేని తెలంగాణ ప్ర‌జ‌లకు ఇది కాస్త ఏవ‌గింపుగా ఉంటుంది. అది స్థానిక నేత‌ల‌పై వ్య‌తిరేక‌త‌ను పెంచే ప్ర‌మాద‌మూ ఉంది. దీనికి ప‌రిష్కారం నిర్ణ‌యాధికారాలు ఢిల్లీలో కాకుండా స్థానికంగా జ‌రగ‌డ‌మే. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో పార్టీ  రాష్ట్ర ఇన్  ఛార్జ్ లో, అధిష్టానం నేత‌లో హైద‌రాబాద్ కు వ‌చ్చి చ‌ర్చ‌లు సాగిస్తే మంచిది.
kcr angry on babu surveys in telangana
కానీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అది సాధ్య‌ప‌డ‌దు. అస‌లు టీడీపీలాంటి పార్టీకే ఇది వీలు కాదు. ఏపీ ముఖ్య‌మంత్రిగా అమ‌రావతిలో నివాస‌ముంటున్న చంద్ర‌బాబుకు తెలంగాణ వ్య‌వ‌హారాల‌పైన నిర్ణ‌యాలు తీసుకునేందుకు ప‌దే ప‌దే హైద‌రాబాద్ రావ‌డం కుద‌ర‌దు. కాబ‌ట్టి మ‌హాకూట‌మి అధికారంలోకి వ‌చ్చి ప్ర‌భుత్వం ఏర్పాటుచేస్తే తెలంగాణ‌కు ఢిల్లీనో, అమ‌రావ‌తినో హై క‌మాండ్ గా ఉంటుంది. ఇది కొత్త స‌మస్య‌ల‌కు దారితీస్తుంది. నిజానికి  కేసీఆర్ కోరుకున్న‌ట్టుగా రెండోసారీ టీఆర్ ఎస్సే అధికారంలోకి వ‌స్తే ఇది అప్రాధాన్యఅంశంగా మారిపోతుంది. అలా కాక  ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌కు తోడు కేసీఆర్ వైఖ‌రిపై ఆగ్ర‌హంతో ఉన్న తెలంగాణ ప్ర‌జ‌లు మ‌హాకూట‌మికి ప‌ట్టం క‌డితే మాత్రం ముందుముందు పాల‌న‌లో ఈ అంశం అనేక ఇబ్బందులు సృష్టించే అవ‌కాశం ఉంది. అస‌లు ప్ర‌తిప‌క్ష‌నేత‌గా కేసీఆర్ ఈ విష‌యాన్నే జ‌నంలోకి ఎక్కువ‌గా తీసుకెళ్తారు. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కావాలంటే…. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ కు ప్ర‌త్యామ్నాయంగా,  హైద‌రాబాద్ నే హైక‌మాండ్ గా భావించే బ‌ల‌మైన పార్టీ ఒక‌టి ఆవిర్భ‌వించాలి. ఇప్ప‌టికిప్పుడు సాధ్యం కాక‌పోయినా..ఎన్నిక‌ల త‌ర్వాత‌యినా తెలంగాణ‌కే ప‌రిమిత‌మ‌య్యే పార్టీ ఒక‌టి రాష్ట్రంలో ఏర్పాటుకావాల్సిన అవ‌స‌రం ఉంది. 
TPCC chief Uttam fire to KCR
ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో దానికి ప్ర‌జ‌ల నుంచి బ‌ల‌మైన మ‌ద్ద‌తే దొరుకుతుంది. ఎందుకంటే కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కు ప్ర‌త్యామ్నాయం కోసం ప్ర‌జ‌లంతా ఎదురుచూస్తున్నారు. టీఆర్ ఎస్ మిత్ర, శ‌తృప‌క్షాల‌లో ఎక్క‌డా కేసీఆర్ కు దీటైన నాయ‌కుడు క‌నిపించ‌క‌పోవ‌డంతో మరో దారిలేక స‌ర్దుకుపోతున్నారు. తెలంగాణ నేప‌థ్యం దృష్ట్యా కూడా ప్రత్యామ్నాయ నాయ‌కుడి అవ‌స‌రం ఆ రాష్ట్రానికి చాలా ఉంది. అలాగే  రాజ‌కీయ శూన్య‌త కూడా ఉంది. లేనిద‌ల్లా ఆ శూన్య‌త‌ను అందిపుచ్చుకునే నాయ‌కుడే. స‌త్తా ఉన్న నేత ఎవ‌రైనా ఎన్నిక‌ల త‌ర్వాత కొన్నాళ్లు ఆగి ఓ కొత్త పార్టీ స్థాపించి ప్ర‌త్యామ్యాయ రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌గ‌లిగితే..తెలంగాణ చ‌రిత్ర మ‌రోదిశ‌లో సాగుతుంది. అయితే ఇక్క‌డే ఓ సందేహం వ‌స్తుంది.
kodandaram party public meeting at palamuru
తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించి..ఇప్పుడు తెలంగాణ జ‌న‌స‌మితి స్థాపించి  మ‌హాకూట‌మితో క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్న కోదండ‌రామ్ కేసీఆర్ కు ప్ర‌త్యామ్నాయాం కాలేరా..? అని. తెలంగాణనే హైక‌మాండ్ గా భావించే తెలంగాణ జ‌న స‌మితి టీఆర్ ఎస్ ను దీటుగా ఎదుర్కోలేదా..? అని. ఎన్నిక‌ల్లో టీజేఎస్ చూపించే ప్ర‌భావ‌మే ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తుంది. పొత్తులో భాగంగా ల‌భించిన స్థానాల్లో టీజేఎస్ గెల‌వ‌గ‌లిగితే….వ‌చ్చే ఐదేళ్ల‌లో ఆ పార్టీ అనూహ్య‌రీతిలో పుంజుకునే అవ‌కాశం ఉంటుంది. అలా కాక‌….ప్ర‌జ‌ల నాడి ప‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మ‌యితే మాత్రం తెలంగాణ రాజ‌కీయ గ‌తిని మార్చ‌డానికి మ‌రో కొత్త పార్టీ రావాల్సిందే..

Related posts

రోజాకు పోటీగా టీడీపీ నుంచి గాలి బ్రదర్స్?

madhu

వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ డీఐజీ

madhu

ప్రతిపక్ష రాజీనామా పర్వం…?

admin

Leave a Comment