telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

అలిగిన పద్మారావు .. డిప్యూటీ స్పీకర్ ఇస్తానంటున్న కేసీఆర్..

deputy speaker to padmaravu

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణ స్వల్పంగా జరుగుతుంది. ఇందులో ప్రాధమికంగా 10మంది కంటే కూర్పు లేదు; అందులో కూడా తమకు స్థానం దక్కనందుకు కొందరు ఆశావహులు అప్పుడే నిరాశకు లోనవుతున్నారు. అందులో సీనియర్ తెరాస నేత, మాజీ శానససభ్యుడు పద్మారావు కూడా ఒకరు. దీనితో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. హైదరాబాదు నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, రంగారెడ్డి నుంచి మేడ్చెల్ శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డికి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించి, తనను మాత్రం పక్కన పెట్టారంటూ వాపోతున్నారట.

గతంలో హైదరాబాదు జిల్లా నుంచి మంత్రులుగా పనిచేసిన నాయిని నర్సింహారెడ్డి, సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే టి.పద్మారావులకు ఈసారి చోటు దక్కలేదు. పద్మారావుకు కేబినెట్‌ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న తనకు కాకుండా టీడీపీ అభ్యర్థిగా తనతో పలుమార్లు తలపడిన శ్రీనివాసయాదవ్‌కు స్థానం కల్పించటంపై పద్మారావు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తలసానికి మంత్రి పదవి ఇవ్వటంపై తనకు అభ్యంతరం లేదని, అదే సమయంలో తనకు కూడా ఇస్తే సరైన గౌరవం ఉంటుందని పద్మారావు పార్టీ ముఖ్యనేతలతో తన బాధ పంచుకున్నారట.

ఈ స్వల్ప విస్తరణతో ఎంతమంది నిరాశకు గురవనున్నారో నేడు గడిస్తేగాని తెలియనుంది. ఇక ఆశావహులు తమకు స్థానం దక్కని పరిస్థితులలో వేరే పార్టీవైపు చూస్తారని మాత్రం విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Related posts