telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ట్రంప్ పై ఆరోపణలు.. ఒక్కో ఆధారం బయటపెడుతున్న డెమోక్రటిక్ నేతలు..

democratic party US reveals trump mistakes

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తరుణంలో ట్రంప్ పై వచ్చిన ఆరోపణలు ఒక్కొక్కటిగా నిజం చేస్తూ ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఈ సారి అధ్యక్ష పదవిపై ట్రంప్ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. కొన్ని రోజులుగా డెమోక్రటిక్ పార్టీ నేతలు ట్రంప్ అభిశంసన పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్న విషయం విధితమే. అందుకు అనుగుణంగా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ కూడా ట్రంప్ పై అభిశంసన కి ఆదేశించారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అంటూ ట్రంప్ కి ఉక్రెయిన్ అధ్యక్షుడికి మధ్య జరిగిన సంభాషణలోని కొన్ని విషయాలు వైట్ హౌస్ బయటపెట్టింది.

తాజాగా విజిల్ బ్లోవర్ ట్రంప్ పై వస్తున్న ఆరోపణలు నిజమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు పక్కా ఆధారాలని ప్రవేశపెట్టారు. దాంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ట్రంప్ తనపై వచ్చిన ఆరోపణలని సర్ది చెప్పుకుంటున్నారు కానీ 2020 లో జరగబోయే ఎన్నికల్లో తనకి మద్దతు తెలుపాలంటూ వివిధ దేశాలపై ట్రంప్ తెచ్చిన ఒత్తిడి నిజమేనని అందుకు తగ్గ ఆడియో లు తన వద్ద ఉన్నాయని బ్లోవర్ తెలిపారు. బ్లోవర్ కేంద్ర ఇంటిలిజెన్స్ విభాగంలో కీలక ఉద్యోగి కావడం గమనార్హం. బ్లోవర్ ప్రవేశ పెట్టిన ఆధారాలని పరిగణలోకి తీసుకుని ట్రంప్ పై అభిశంసన పెట్టాలని డెమోక్రాట్లు పట్టు పడుతున్నారు.

Related posts