telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

డోన్ పైలెట్ కావలెను .. జీతం 25వేలు.. !

demand for done pilets in near future

డోన్, సరికొత్త టెక్నాలజీలో ముఖ్యంగా మనం వింటున్న సదుపాయం ఇది. దీనితో ప్రాధమికంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయక చర్యలు అందించేందుకు.. ఉపయోగించాలని భావించారు. అయితే దీనిని ఇప్పుడు ప్రతి దానిలో వాడుతుండటం విశేషం. మన భారతీయులు అమిత ఇష్టంగా జరుపుకొనే వేడుకలకు కూడా డోన్ కెమెరాలను వాడుతుండటం విశేషం. అయితే తాజాగా వీటివినియోగం పై అధికారిక ఆమోదం కూడా లభించడంతో, వినియోగం కూడా భారీగానే పెరిగిపోయింది. డ్రోన్‌ల ద్వారా కలిగే ప్రయోజనాలను, వాటి అవసరాన్ని గుర్తించిన డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ).. తొలిసారిగా డ్రోన్ పాలసీకి రూపకల్పన చేసింది. ఫలితంగా ఇప్పటివరకు కొన్ని విభాగాలకే పరిమితమైన డ్రోన్‌ల వినియోగం ఇక అందరికీ అందుబాటులోకి రానుంది.

మరోవైపు కెరీర్ పరంగా కూడా అవకాశాులు ఇందులో మెండుగా ఉన్నాయి. పదవతరగతి నుంచి ఇంజనీరింగ్‌లో ఏరోడైనమిక్స్, ఎలక్ట్రానిక్స్ చేసిన వారికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో వాణిజ్య, వ్యాపార విభాగాల్లోనూ వీటి వాడకం పెరగనుందని నిపుణుల అంచనా. స్వల్ప పరిమాణంలో ఉన్న ఎగిరే వాహనమే డోన్. దీనికి కూడా విమానం మాదిరిగానే ల్యాండింగ్, టేకాఫ్ అనేవి తప్పనిసరి. వాడుక భాషలో డ్రోన్ అనిపిలుస్తున్నప్పటికి సాంకేతిక భాషలో ఆర్‌పీఏఎస్(రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాప్ట్ సిస్టమ్స్)గా పిలుస్తారు. దీన్ని ఆపరేట్ చేసేందుకు పైలట్ల అవసరం కూడా వేల సంఖ్యలో పెరగనుంది. డ్రోన్‌కి సంబంధించిన పైలట్ నిర్దేశిత ప్రాంతంలో కూర్చుని రిమోట్ ఆధారంగా గాలిలో ఎగురుతున్న డ్రోన్ కదలికలను నియంత్రిస్తుంటారు.

అతి సమీప భవిష్యత్తులో ముఖ్యంగా ఈ- కామర్స్, హెల్త్ సెక్టార్, ట్రావెల్ రంగాల్లోనూ డ్రోన్‌ల ప్రవేశానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. ప్రైమ్ నౌ పేరుతో డ్రోన్ డెలివరీ వ్యవస్థను ప్రారంభించింది. ఇంతులో అర్హత పొందాలంటే పదవతరగతితో పాటు 18 ఏళ్ల వయసు ఉండాలి. ఇంగ్లీష్‌లో పరిజ్ఞానం ఉంటే డ్రోన్ పైలట్‌గా మారొచ్చు. డ్రోన్ పైలట్లకు ప్రస్తుతం మీడియా అండ్ ఎంటర్‌లైన్‌మెంట్, ఫొటోగ్రఫీ, సినిమా రంగాల్లో ఎక్కువ అవకాశాలు లభించనున్నాయి. వివిధ రాజకీయ పార్టీల సభలకు, వేడుకలకు కూడా డ్రోన్ కెమెరాలతో ఫోటోలు తీయడం పరిపాటిగా మారింది. ఇక భవిష్యత్తులో వ్యవసాయం, సర్వేయింగ్ రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. వ్యవసాయరంగంలో డ్రోన్ల వాడకం ద్వారా విత్తనాలు చల్లడం, పురుగుమందులు చల్లడం వంటి కార్యకలాపాలకు ఆస్కారం ఉంది. అలాగే సర్వేయింగ్ విభాగంలో మైనింగ్, రైల్వే ట్రాక్స్, ల్యాండ్ సర్వేల వంటి డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించి టెక్నికల్ లోపాలు ఏవైనా ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటారు. సమస్యలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయడానికి అవకాశం ఉంటుంది.

ప్రస్తుతానికి డ్రోన్ల వాడకంలో అమెరికా తొలి స్థానంలో ఉంటే.. తరువాతి స్థానంలో భారత్ నిలుస్తోంది. 2021 నాటికి భారత్‌లో 50 వేల మంది డ్రోన్ పైలట్ల అవసరం ఏర్పడనుందని నిపుణుల అంచనా.

డ్రోన్ పైలట్ కోసం శిక్షణ ఇచ్చే సంస్థలు :
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రోన్స్
మావన్ డ్రోన్ అకాడమీ
ఇండియన్ అకాడమీ ఆఫ్ డ్రోన్స్
నేషనల్ డ్రోన్ స్కూల్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ

Related posts