telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

భర్తకు పుట్టినరోజు గిఫ్ట్ ఆర్డర్ చేసిన భార్య… డెలివరీ బాయ్ ప్రవర్తనతో షాకై…!?

New couples attack SR Nagar

పాకిస్థాన్‌కు చెందిన 35 ఏళ్ల వ్యక్తి దుబాయ్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. బ్రిటన్‌కు చెందిన 36ఏళ్ల మహిళ.. తన భర్త పుట్టిన రోజు సందర్భంగా అతనికి ఓ సైకిల్‌ను బహుమానంగా ఇవ్వాలనుకుని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన సైకిల్‌ను ఆ మహిళ ఇంటికి తీసుకొచ్చిన పాకిస్థానీ డెలివరీ బాయ్.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సైకిల్‌ తీసుకోవడానికి ఇంటి నుంచి బయటికొచ్చిన ఆమె చేతిపై డెలివరీ బాయ్ అకస్మాత్తుగా ముద్దు పెట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా షాకయిన ఆమె.. వెంటనే ఇంట్లోకి వెళ్లి, తలుపులేసుకుంది. అంతటితో ఆగని డెలివరీ బాయ్.. ఆమె ఇంటి గుమ్మం ముందు సైకిల్ పెట్టి, తలుపులు బాదాడు. ఇదంగా కిటికీలోంచి గమనించిన ఆమె.. సైకిల్ తీసుకోవడానికి తలుపులు తెరిచింది. అప్పటి వరకు అక్కడే ఉన్న ఆ డెలివరీ బాయ్.. మళ్లీ అమె చేయిపట్టి లాగి, పెదాలపై ముద్దు పెట్టాడు. డెలివరీ బాయ్ ప్రవర్తనతో ఆగ్రహానికిలోనైన సదరు మహిళ.. డెలివరీ బాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Related posts