టూల్‌కిట్ కేసులో నికితాకు ఊరట లభించింది. ముంబై హైకోర్ట్ ఆమెకు మూడు వారాల పాటు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసింది. అమె అరెస్ట్ అయితే… 25వేల వ్యక్తిగత బాండ్‌పై విడుదల చేసేందుకు అనుమతి కూడా ఇచ్చింది. కానీ టూల్‌కిట్ కేసును లోతుగా విచారిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. ఈ కేసులో ముంబై లాయర్ నికితా జాకోబ్ ప్రధాన నిందితురాలని తేల్చారు. రైతుల నిరసనకు మద్దతుగా టూల్‌కిట్‌ను తయారీ చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్టు చెప్తున్నారు. ఆమె కమిటెట్ ఆపరేట్‌గా పనిచేశారని కూడా గుర్తించారు. టూల్‌కిట్‌ను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు… దిశా రవి, గ్రేటాను వినియోగించుకున్నారని చెప్తున్నారు ఢిల్లీ పోలీసులు. వీరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్, ఈమెయిల్స్, పెన్డ్రైవ్సహా మొత్తం డేటాను స్వాధీనం చేసుకున్నారు. కమ్యునికేషన్ కోసం టెలిగ్రామ్, సర్ఫ్‌షార్క్, ప్రోటాన్ వీఎం, సైబర్ గోస్ట్ వంటి యాప్‌లను కూడా వాడారని గుర్తించారు. ఖలిస్తానీకి చెందిన పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్‌కు చెందిన ఇమెయిల్ ఐడీపై విచారణ జరుపుతుండగా…. నికిత పాత్ర బయటపడినట్టు చెప్తున్నారు పోలీసులు. చూడాలి మరి ఇంకా ఏం జరగనుంది అనేది.
previous post