telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతుల చక్కాజామ్ : ఢిల్లీలో హైఅలర్ట్‌

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.   రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దుకే డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  నేడు దేశ‌వ్యాప్తంగా ర‌హ‌దారులను దిగ్బందించనున్నారు రైతులు. మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల వరకు జక్కాజామ్‌ కొనసాగుతుందని ఇప్పటికే ప్రకటించాయి రైతు సంఘాలు. రెండు నెలలకు పైగా ఉద్యమం చేస్తున్న రైతులు, ఈరోజు వినూత్న రీతిలో మ‌రో దేశవ్యాప్త ఆందోళ‌న‌ చేయనున్నారు. అయితే అంబులెన్స్, స్కూల్ బస్సులతో పాటు అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తామని పేర్కొంది. చక్కాజామ్‌ పూర్తిగా శాంతియుతంగా జరుగుతుందన్నారు రైతు సంఘాల నాయకులు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, సాధారణ పౌరులతో ఎలాంటి గొడవలకు పాల్పడవద్దని ఆందోళ‌న‌కారుల‌కు సూచించింది సంయుక్త కిసాన్‌ మోర్చా. ఇది ఇలా ఉండగా… చక్కా జామ్‌ సందర్భంగా ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక బలగాలను మోహరించింది. సరిహద్దుల్లో బారికేడ్లే ఏర్పాటు చేశారు. తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటర్‌ కెనాన్‌ వెహికల్స్‌ను కూడా సిద్ధం చేశారు.

Related posts