Trending Today క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

పెళ్లికి నో చెప్పిందని యువతిపై దాడి చేసిన ఓ అధికారి కొడుకు.. అధికార దాహమేనా..?

Delhi Police Officer son Assaulting a Women

దేశ రాజధాని నగరంలో దారుణం చోటు చేసుకుంది… ఢిల్లీకి చెందిన ఓ పోలీస్ అధికారి కొడుకు ఓ యువతిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు… ఆమెను ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ తీవ్రంగా గాయపరిచాడు అంతటితో ఊరుకోకుండా ఈ తతంగాన్నంతా తన స్నేహితుడితో వీడియో తీయించి సామజిక మాధ్యమాల్లో పెట్టించాడు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పోలీసుల దృష్టికి వచ్చింది….

vs rw

కాగా ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన యువకుడిని ఢిల్లీ పోలీసు నార్కోటిక్ విభాగం ఏఎస్సై అశోక్ సింగ్ తోమర్ యొక్క కుమారుడు రోహిత్ తోమర్ గా గుర్తించి నిందితుడిని పట్టుకొని అతనిపై ఐపీసీ సెక్షన్ 354, 506 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు…. అయితే బాధిత యువతి ఢిల్లీలోని తిలక్ నగర్ లో ఉండే ఓ బీపీఓ ఆఫీస్ లో పనిచేస్తున్నట్లు తెలిసింది….. ఆఫీసులో ఎవరూ లేని సమయంలో స్నేహితులతో సహా అక్కడికి చేరుకున్న రోహిత్ తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించి దానికి నిరాకరించడంతో ఈ ఉదంతానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది…. అయితే పోలీసులు పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు…

Related posts

మంచులో ఢిల్లీ నగరం…

admin

టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పే సమయం వచ్చింది: ఉత్తమ్

madhu

జాగ్రత్త… బాలీవుడ్ పాటలు వింటే… ఉద్యోగం ఊడుతుంది…!

vimala t

Leave a Comment