telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వారికి పై కఠిన చర్యలు తీసుకుంటాం అంటున్న ఢిల్లీ కమిషనర్..

ఈ ఏడాది దేశంలో దీపావళి సందర్బంగా కోన్ని రాష్ట్రాలు బాణాసంచాను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వాటిలో కొన్ని ప్రజల ఆరోగ్యం కోసమని, మరికొన్ని దేవతల బొమ్మలు ఉండకూడదంటూ కొన్న నిబంధనలు పెట్టాయి. అయితే ఇటీవల ఈ జాబితాలోకి ఢిల్లీ కూడా చేరింది. ఢిల్లీ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారింది అక్కడి కాలుష్యం దానికి తోడుగా కరోనా రెండో విడత విజృంభన ఇలా చెబితే చాలానే వస్తాయి. అయితే రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎన్నో చర్యలను ప్రభుత్వం చేపట్టింది. వాటిలో భాగంగా ఈ ఏడాది బాణాసంచా పేల్చడం, అమ్మడం నేరాలుగా పరిగణిస్తూ నిబంధనలను అమలు చేసింది. దానిపై అక్కడి పోలీస్ కమీషనర్ మాట్లాడారు. ‘రాష్ట్ర కాలుష్య పరిణామాల రాత్యా రాష్ట్రంలో బాణాసంచా అమ్మకం, కొనుగోలు నేరంగా పరిగణించ బడుతుంది. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తూ బాణాసంచా అమ్మినా, వాడినా వారికి విరుద్దంగా కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఇప్పటి వరకూ ఇచ్చిన లైసెన్సులను రద్దు చేస్తున్నామ’ని కమీషనర్ ఎస్ఎన్ శ్రీవాత్సవ తెలిపారు. అయితే నవంబరు 30 వరకు రాష్ట్రంలో ఎటువంటి అమ్మకాలు జరగకూడదని, పెట్రోలింగ్ సిబ్బంది ఉంటుందని తెలిపారు.

Related posts