telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పైరసీ రాజా పై … హై కోర్టు సీరీయస్ … బ్లాక్ చేయాల్సిందే..

delhi high court ordered to block piracy sites

తమిళ్ రాకర్స్ దేశంలో ఒక సినిమా విడుదల అయిన రోజే నెట్ లో పెట్టె స్థాయికి పైరసీ చేస్తుంది. దీనితో వందల కోట్లు ఖర్చు పెట్టి భారీగా తీసిన చిత్రాలు దాదాపుగా నష్టాన్ని చవిచూస్తున్నాయి. ముఖ్యంగా అనేక దక్షిణాది చిత్రాలు విడుదల రోజున, కొన్ని సందర్భాల్లో అంతకుముందే ఈ వెబ్ సైట్ లో ప్రత్యక్షమైన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, తమిళ్ రాకర్స్ ను బ్లాక్ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది.

పైరసీ విషయంలో ఒక్క తమిళ్ రాకర్స్ ని మాత్రమే కాకుండా, ఈజెడ్ టీవీ, కట్ మూవీస్, లైమ్ టొరెంట్స్ వంటి సైట్లను తాత్కాలికంగా నిలుపుదల చేసేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయా సైట్ల యూఆర్ఎల్స్, ఐపీ అడ్రెస్ లను బ్లాక్ చేయాలని పేర్కొంది. పలు నిర్మాణ సంస్థల కాపీరైట్లను ఉల్లంఘించాయంటూ వాటి డొమైన్ రిజిస్ట్రేషన్లను కూడా తొలగించాలంటూ కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు స్పష్టం చేసింది.

Related posts