• Home
  • వార్తలు
  • 2వేల కోట్లు కాదు 10వేల కోట్ల కుంభకోణం చేసినా క్షణాల్లో బెయిల్…
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు వ్యాపార సామాజిక

2వేల కోట్లు కాదు 10వేల కోట్ల కుంభకోణం చేసినా క్షణాల్లో బెయిల్…

Delhi High Court Grant Bail to bhushan steel neeraj singal

80అనుబంధ కంపెనీలను ఉపయోగించి సుమారు రెండువేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రధాన నిందితుడికి ఈరోజు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక బెయిల్ ను మంజూరుచేసింది… భూషణ్ స్టీల్ మాజీ ప్రమోటర్ నీరజ్ సింగాల్ ను ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం వారు అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ ఈనెల ఎనిమిదవ తారీఖున నీరజ్ హైకోర్టులో పిటిషన్ వేశాడు.

జస్టిస్ ఎస్.మురళీధర్, వినోద్ గోయల్ ఇరువురు ఆ పిటిషన్ ను విచారించి నీరజ్ కు ఐదులక్షల రూపాయల పూచీకత్తు (సెక్యూరిటీ) చూపించి బెయిల్ పొందవచ్చని తీర్మానించింది… అంతేకాకుండా కోర్టుకు తెలియకుండా విదేశీ ప్రయాణం చేయరాదని, సాక్ష్యులను తారుమారు చేయడానికి ప్రత్నించడానికి వీల్లేదని షరతులు విధించి తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేసింది..

కాగా తన అరెస్ట్ ను సవాలు చేస్తూ ఎలాంటి లిఖిత పూర్వక, మౌఖిక సమాచారాలు ఇవ్వకుండా ఎలాంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేశారని ఆరోపించాడు.. కాగా ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ఆర్.బీ.ఐ ప్రకటించిన మొత్తం 12 సమస్యాత్మకమైన ఆస్తులలో భూషణ్ స్టీల్ కూడా ఒకటని అంతేకాకుండా నీరజ్ ని సెక్షన్ 447 కింద అరెస్ట్ చేశారు.. ఇలా అరెస్ట్ అయినవారు కనీసం ఆరునెలలనుంచి పదేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించవలసి వస్తుంది…

Related posts

ఆమ్రపాలికి… ఈసీ కీలక బాధ్యతలు…

chandra sekkhar

ఆ కుక్కపిల్ల జనంతో కేక పెట్టిస్తోంది… కెవ్వు కేక…

admin

తుది శ్వాస వరకు ప్రజాసేవలోనే.. : జనసేనాని

admin

Leave a Comment