telugu navyamedia
news political

అసెంబ్లీ స్పీకర్‌కు ఆరు నెలల జైలు శిక్ష

ramnivas goel speaker delhi

ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రామ్ నివాస్ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2015 సంవత్సరంలో ఫిబ్రవరి 6వ తేదీన తూర్పు ఢిల్లీలో బిల్డర్ ఇంటిపై రామ్ నివాస్ ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. బిల్డర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సంవత్సరం అనంతరం కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

ఢిల్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు ఈ అల్లర్ల ఘటన చోటు చేసుకుంది. దుప్పట్లు, లిక్కర్ పంచుతున్నాడని బిల్డర్ ఇంటిపై రామ్ నివాస్, అతని అనుచరలు దాడికి పాల్పడినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. దాడిలో అల్మారా, కిచెన్ వస్తువులు, కిటికీలు ధ్వంసమయ్యాయని, అడ్డుకోబోయిన పనివాళ్లపై దాడి చేశారని ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు.

Related posts

జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు: డీజీపీ గౌతమ్ సవాంగ్

vimala p

స్కూళ్ల పక్కనే వైన్ షాపులు..సర్కారుపై వీహెచ్ ఫైర్

vimala p

ఎంపీల సంఖ్య పెరిగితేనే కేంద్రంపై ఒత్తిడి: జగన్‌

ashok