telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో … ఢిల్లీ ఎన్నికల నగారా ..

kejriwal on his campaign in ap

డిల్లీ లో ఎన్నికల నాగారా మొగెసింది. ఫిబ్రవరి 8 న పోలింగ్, 11 న ఫలితాలు ఉంటాయి అని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ 14వ తేదీన విడుదల అవుతుంది. నామినేషన్లు వేసేందుకు 21 చివరి తేదీ. ఎన్నికల ప్రకటన రావడంతో దిల్లీలో ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికలలో 1,46,92,136 ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. డిల్లీ లో దాదాపు 70 అసంబ్లీ స్థానాలు ఉన్నాయి, 13750 పోలింగ్ బూతులలో ఓటింగ్ జరగబోతుంది. చివరి సారిగా 2015లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఏకంగా 67 స్థానాలతో క్లీన్ స్వీప్ చేసింది.

మోడి వ్యతిరేక శక్తి గా దేశరాజధానిలో జండా ఎగరువేసిన కేజ్రీవాల్ ఈ సారి ఎలా ముందుకు వెళతారు అనేది ప్రశ్నార్థకం గా మారింది. కాంగ్రెస్ తో కలిసి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్న కేజ్రీ త్వరలోనే మోడి వ్యతిరేక పార్టీలు అందరినీ కలవబోతున్నారు. మోడి కి తాను భారీ ప్రత్యామ్న్యాయమని నిరూపించుకోవడం కోసం కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా మోడి కి ఎదురు నిలిచే సత్తా ఉన్న ప్రతీ నాయకుడిని, ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నేతలను కలవబోతున్నారు. అందులో భాగంగా ఏపీసీఎం జగన్ మోహన్ రెడ్డి ని కూడా కలిసే ఆలోచనలో ఉన్నారని, ఇప్పటికే విజయ్ సాయి రెడ్డి తో భేటీ కి రంగం సిధ్దం అవుతోందని సమాచారం.

Related posts