telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గుజరాత్ ఎన్నికల పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌…

arvind-kejriwal

దేశంలో బీజేపీని సవాలు చేయగలిగిన పార్టీ ఆప్ మాత్రమేనన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌. గుజరాత్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ న్నికల్లో ఆప్ తొలిసారిగా అడుగుపెట్టి, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ లో 27 సీట్లు గెలుచుకుంది. ఆప్ అభ్యర్థుల ఘనవిజయాన్ని పురస్కరించుకుని అక్కడ రోడ్‌షో నిర్వహించారు కేజ్రీవాల్‌. అందులో… ఇతర పార్టీలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకోవడం వల్లే గత 25 ఏళ్లుగా బీజేపీ గుజరాత్‌ను ఏలుతూ వచ్చిందని విమర్శించారు. గుజరాత్‌లో ఆప్ సాధించిన విజయం నూతన రాజకీయాలకు ఆరంభ సూచకమని అన్నారు. కాగా, తాజాగా మొత్తం 576 స్థానాలకు ఎన్నికలు జరుగగా, బీజేపీ 483 చోట్ల, కాంగ్రెస్ 55 చోట్ల, ఆప్ 27 చోట్ల విజయం సాధించాయి. ఆప్ గెలిచిన అన్ని స్థానాలూ సూరత్ లోనే కావడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా పొందలేదు. సూరత్ పట్టణంలో పీఏఏఎస్ (పటీదార్ అనామత్ ఆరక్షన్ సమితి) కాంగ్రెస్ కు మద్దతు ఉపసంహరించడంతో, ఆప్ కు పరిస్థితి అనుకూలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts