telugu navyamedia
రాజకీయ వార్తలు

మూడు బిలియ‌న్ డాల‌ర్ల ఒప్పందం: ట‌్రంప్‌

modi trump

భార‌త్‌తో మూడు బిలియ‌న్ డాల‌ర్ల ర‌క్ష‌ణ ఒప్పందం కుదిరిన‌ట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని హైద‌రాబాద్ హౌజ్‌లో ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అడ్వాన్స్‌డ్ మిలిట‌రీ ఎక్విప్‌మెంట్‌ను భార‌త్ కోనుగోలు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. అపాచీ, ఎంహెచ్‌-60 రోమియో హెలికాప్ట‌ర్ల‌ను కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఖ‌రీదు చేయ‌నున్నారు.

5జీ నెట్‌వ‌ర్క్ గురించి కూడా ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు తెలిపారు. మ‌హిళా వ్యాపార‌వేత్త‌ల‌ను ప్రోత్స‌హించేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. స‌మాజంలో మాద‌క ద్ర‌వ్యాల‌ను నియంత్రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఉగ్ర‌వాదంపై పోరాడేందుకు పాకిస్థాన్‌తో క‌లిసి ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పారు. భార‌త్ అద్భుతాల‌కు మెలానియా దాసోహం అయ్యింద‌ని, ఇక్క‌డ ప్ర‌జ‌ల ద‌యా హృద‌యం మ‌మ్ముల్ని ఎంతో ఆక‌ర్షించింద‌ని ట్రంప్ అన్నారు.

Related posts