telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అవి లేకుండా మాత్రం ఇంటికి రావొద్దు… రణ్వీర్ కు దీపికా వార్నింగ్

Deepika

బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె తన భర్త ర‌ణ్వీర్ సింగ్‌ కు వార్నింగ్ ఇచ్చింది. విషయమేమిటంటే… 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిల‌వ‌గా, ఆ సక్సెస్ స్టోరీ ఆధారంగా “83” మూవీ రూపొందుతుంది. హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. చిత్రంలో క‌పిల్ దేవ్ పాత్ర‌ని ర‌ణ్‌వీర్ సింగ్ పోషిస్తున్నారు. దీపిక.. రోమి దేవ్ అనే పాత్ర‌లో ర‌ణ్‌వీర్‌కి భార్య‌గా కనిపించ‌నుంది. ర‌ణ్వీర్‌, దీపిక పెళ్లి అయిన త‌ర్వాత వీరిద్ద‌రూ `83` చిత్రంలో తొలిసారి దంప‌తులుగా క‌న‌ప‌డుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుద‌ల‌వుతుంది. సినిమా ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా ర‌ణ్వీర్ చెన్నై చేరుకుని త‌న సినిమాకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దానికి దీపిక స్పందిస్తూ ..వచ్చేట‌ప్పుడు కిలో మైసూర్‌పాక్‌.. అర‌కిలో ఆలు చిప్స్ ప‌ట్టుకురండి.. ఇవి లేకుండా మాత్రం ఇంటికి రావొద్దు“ అంటూ స‌ర‌దాగా ఓ షాపింగ్ లిస్టును ఇచ్చింది. దీపిక ఇన్‌స్టాలోనే భ‌ర్త‌కు ఆర్డ‌ర్ వేయ‌డం చూసిన డైరెక్ట‌ర్ క‌బీర్‌ఖాన్ భార్య కూడా దీపిక చెప్పిన లిస్టులోని వ‌స్తువుల‌నే ఇంటికి తీసుకు రమ్మంటూ ఆర్డ‌ర్ వేసింది. ఇప్పుడు వీరిద్ద‌రి మెసేజ్‌లు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

Related posts