telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వాళ్ళ డ్యాన్స్ చూసి కన్నీరు ఆపుకోలేకపోయిన దీపికా…!

Deepika Padukone

బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ప్రస్తుతం తన సినిమా ‘ఛపాక్’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ప్రజలకు బాగా చేరువైన టీవీ షోల ద్వారా తన చిత్రాన్ని ప్రచారం చేసుకునే పనిలో ఉన్నారామె. తన చిత్ర ప్రచారంలో భాగంగా ‘ది కపిల్ శర్మ షో’లో కూడా దీపికా పాల్గొనబోతున్నారు. పెళ్లి తరవాత ఈ షోలో దీపికా పాల్గొననుండటం ఇదే తొలిసారి. ఈ క్రమంలో తాజాగా డ్యాన్స్ రియాలిటీ షో ‘డ్యాన్స్ ప్లస్’లో ఆమె పాల్గొన్నారు. ఈ షోలో దీపికాకు ఒక ఎమోషనల్ మూమెంట్ ఎదురైంది. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ అంతా ఈ 33 ఏళ్ల నటికి తమ డ్యాన్స్‌తో నీరాజనం ఇచ్చారు. బాలీవుడ్‌లో దీపికా పదుకొనే జర్నీని ఆమె సినిమాల్లోని పాటలతో డ్యాన్స్ రూపంలో ప్రదర్శించారు. దీపికాకు ఈ నృత్య నీరాజనం ‘పద్మావత్’లోని ‘గూమర్’ సాంగ్‌తో ముగిసింది. కంటెస్టెంట్స్ ఈ సాంగ్స్ ప్రదర్శిస్తున్నంత సేపు చాలా ఆసక్తిగా, భావోద్వేగానికి గురవుతూ చూసిన దీపికా పదుకొనే.. ఆఖరి పాటకు వచ్చేటప్పటికి కన్నీటిని ఆపుకోలేకపోయారు. తన రెండు చేతులూ ముఖానికి అడ్డంగా పెట్టుకుని ఏడ్చేశారు. ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తోన్న రెమో డిసౌజా భుజంపై వాలిపోయి బోరుమన్నారు దీపికా. దీంతో ప్రేక్షకులంతా పైకి లేచి దీపికా.. దీపికా.. అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దీపికా మాట్లాడుతూ.. ‘‘నేను ఇప్పటి వరకు చాలా షోల్లో పాల్గొన్నాను. కానీ, ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మాత్రం చెప్పగలను’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related posts