telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

10 నిముషాల నిడివి పాత్రలో దీపికాపదుకొనే ..

deepika padukone 10 min cast in 83 movie

బయోపిక్ ట్రెండ్ లో లెజెండరీ ఇండియా క్రికెటర్ కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా ’83’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కబీర్ ఖాన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రణ్‌వీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ నటి దీపికాపదుకొనే కీలక పాత్రలో మెరువనుంది. రియల్‌లైఫ్ మాదిరిగానే రీల్‌లైఫ్‌లో రణ్‌వీర్‌సింగ్ భార్యగా దీపికాపదుకొనే కనిపించనుంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో దీపికా పాత్ర నిడివి కేవలం 10 నుంచి 12 నిమిషాలు మాత్రమే ఉంటుందట. దీపికాపదుకొనే త్వరలోనే లండన్‌లో జరిగే షూటింగ్‌లో జాయిన్ కానుంది. సాకిబ్ సలీం 83 ప్రాజెక్టులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకురానుంది.

Related posts