telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మాకు సహజీవనం నచ్చలేదు… : దీపికా పదుకొనే

ranveer singh

స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు. ఆమె నటనాపరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా యూత్ లో భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ మెరుపుతీగ బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ను గత సంవత్సరం పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ చివరకు వివాహం చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ పై కూడా వీరిద్దరూ సూపర్ హిట్ జోడిగా నిలిచారు. పెళ్లికి ముందు కొంతకాలం సహజీవనం చేసి ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది నేటి ట్రెండ్. అయితే తాము మాత్రం అలా చేయలేదంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే. పెళ్లికి ముందే సహజీవనం చేస్తే.. పెళ్లి తర్వాత ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి ఏమీ ఉండదని ఆమె అభిప్రాయపడింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీపిక ఈ విషయం వెల్లడించింది. “ప్రేమలో పడ్డ వెంటనే సహజీవనం చేయాలనుకోవడం నాకు నచ్చలేదు. ఇష్టపడిన వ్యక్తి గురించి పెళ్లికి ముందే తెలుసుకోవడం కోసం ఇలా చేస్తుంటారు. మాకు ఆ పద్ధతి నచ్చలేదు. అందుకే మేం సహజీవనం చేయలేదు. మేం సరైన నిర్ణయమే తీసుకున్నామని అనుకుంటున్నా. ఇప్పుడు భార్యభర్తలుగా ప్రతీ క్షణాన్నీ ఆస్వాదిస్తున్నాం. మాకు వివాహ వ్యవస్థపై చాలా నమ్మకముంది” అని దీపిక వ్యాఖ్యానించింది.

Related posts