telugu navyamedia
Uncategorized

కాలుష్యరహిత దీపావళి జరుపుకుందాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం!

diwali festival

చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసంలో అమవాస్య రోజున దీపావళి వస్తుంది. దీపావలి పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి రోజున నరక చతుర్థశిగా జరుపుకుంటారు. దీప కాంతులతో వెలుగొందే గృహ అలంకరణలు, బాణసంచా చప్పుళ్ళుతో అందరు ఆనందోత్సాహాలతో ఈ దీపావళిని జరుపుకుంటారు. అయితే ఈ టపాసుల వల్ల కలిగే వాయు, శబ్ద కాలుష్యాన్ని పెద్దగా పట్టించుకోరు.

దీపావళి రోజున వెలువడే వాయు కాలుష్యం పై దాసరి పద్మ స్మారక యువజన సమాఖ్య పలు సూచనలను ప్రచారం చేస్తుంది. పచ్చని ప్రకృతిని కాపాడడానికి టపాసులు కాల్చకుండా ఈ సారి దివాలీని జరుపుకుందాం. మన చిన్నారులకు పొగలేని దివ్వెలను అందిద్దాం. విషవాయువును తగ్గించి ఆనందాన్ని పెంచుకుందామని తెలిపింది. వాయు కాలుష్యం తీవ్రతవల్ల శ్వాస సంబంధిత వ్యాధులు… తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నారులు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తపడండని తెలిపింది.

Related posts