telugu navyamedia
telugu cinema news trending

రాఖీ సావంత్ కు మాజీ ప్రియుడి హెచ్చరిక

Rakhi

వివాదాస్పద నటి రాఖీ సావంత్ తాను త్వరలోనే రియాలిటీ టీవీ స్టార్, ఇంటర్నెట్ సెలబ్రిటీ దీపక్‌ను పెళ్లాడనున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత ఏమైందో కానీ.. దీపక్‌ను తాను పెళ్లాడడం లేదని పేర్కొని సంచలనం రేపింది. తాజాగా యూకేకు చెందిన ఎన్నారై రితేశ్‌ను రహస్యంగా వివాహమాడింది. ఆమె పెళ్లిపై వచ్చిన వార్తలను తొలుత ఖండించిన రాఖీ.. ఆ తర్వాత నిజం ఒప్పుకుంది. ఎన్నారై రితేశ్‌ను పెళ్లి చేసుకున్నట్టు అంగీకరించింది. దీంతో ఆమె మాజీ ప్రియుడు దీపక్ ఖలాల్ షాకయ్యాడు. రాఖీ రహస్యంగా పెళ్లి చేసుకుని తనను మోసం చేసిందని ఆరోపించాడు. తనను పెళ్లి చేసుకుంటానంటే నమ్మి నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చానని పేర్కొన్నాడు. తానిచ్చిన నాలుగు కోట్ల రూపాయలను నయాపైసలతో సహా చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఇందుకోసం నాలుగు రోజులు గడువిచ్చాడు. ఆలోగా తన డబ్బులను వెనక్కి ఇవ్వకుంటే రాఖీ జీవితాన్ని సర్వనాశనం చేస్తానని హెచ్చరించాడు. దీపక్ బెదిరింపులపై రాఖీ స్పందించింది. దీపక్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను తనను ఏమీ చేయలేడని, ఏం చేసుకుంటాడో చేసుకోవాలని గట్టిగా బదులిచ్చింది. తన భర్తపై మరోమారు తప్పుగా మాట్లాడితే బాగుండదని హెచ్చరించింది.

Related posts

రాశిఫలాలు : .. పనులు పూర్తిఅవుతాయి.. భాగస్వామి అనారోగ్యం..

vimala p

హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ నిర్మాతగా ప్రారంభ‌మైన కొత్త చిత్రం `RDX`

ashok

పవన్ కొత్త లుక్ వైరల్

vimala p