telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

దీపక్ చాహర్ బౌలింగ్ వీడియో వైరల్

chahan

దేశంలో లాక్‌డౌన్ నిబంధనల్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం సడలించడంతో టీమిండియా క్రికెటర్లు వ్యక్తిగతంగా ప్రాక్టీస్ మొదలెట్టారు. ఈ క్రమంలో భారత ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్.. తన సోదరి మాలతి చాహర్‌తో కలిసి ప్రాక్టీస్‌ని ప్రారంభించాడు. మాలతి బ్యాటింగ్ చేస్తుండగా.. ఆమెకి బౌలింగ్ చేసేలా కనిపించిన చాహర్… ఆఖర్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. గంటకి 135-140కిమీ వేగంతో దీపక్ చాహర్ సంధించే బంతిని మాలతి ఎలా ఎదుర్కొంటుంది..? అని అంతా ఆసక్తి ఎదురుచూడగా… రెగ్యులర్ రన్నప్‌తో వచ్చిన చాహర్ అనూహ్యంగా అండర్ ఆర్మ్ బౌలింగ్ చేశాడు. మాలతి కూడా స్లిప్ దిశగా ఆ బంతిని హిట్ చేయగా ఈ వీడియోకి ఐపీఎల్ కామెంట్రీని జతచేసి మరీ అభిమానులతో మాలతి పంచుకుంది. దీపక్ చాహర్ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించినట్లు కనిపిస్తున్నాడు. గత ఏడాది డిసెంబరులో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడుతూ గాయపడిన దీపక్ చాహర్.. అప్పటి నుంచి క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. మధ్యలో కరోనా కారణంగా లాక్‌డౌన్ రూపంలో ఊహించని విధంగా అతనికి మూడు నెలలు బ్రేక్ కూడా లభించింది. దాంతో ఇప్పుడు అతను వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

🤣🤣🤣 We miss IPL😔 💛 # ipl #csk

A post shared by Malti Chahar(Meenu) (@maltichahar) on

Related posts