telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై.. త్వరలో మంచి కబురు: ట్రంప్‌

trump new policies on h1b visa

పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్‌ వాయు సేన మెరుపు దాడులు నిర్వహించడంతో భారత్‌-పాక్‌ మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. వియత్నాంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌తో భేటీ అయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే ఈ అంశం ముగిసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌-పాకిస్థాన్‌ నుంచి మంచి కబురు త్వరలోనే అందుతుందని తాము భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించి.. సామరస్య వాతావరణం కల్పించేందుకు అమెరికా తీవ్రంగా మధ్యవర్తిత్వం జరుపుతోంది. ఇందులో భాగంగా ఇరుదేశాల విదేశాంగ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పొంపియో మాట్లాడటంతో సహా పలు చర్యలు తీసుకుంది.

Related posts