telugu navyamedia
సినిమా వార్తలు

డియ‌ర్ మేఘ ట్రైల‌ర్ ..

అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ జంటగా తెరకెక్కిన సినిమా ‘డియర్ మేఘ’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్ అయింది. అర్జున్‌ సోమయాజులు ప్రధాన పాత్రల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెర‌కెక్కించిన చిత్రం డియ‌ర్ మేఘ‌.

వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని అర్జున్ దాస్య‌న్ నిర్మించారు.సెప్టెంబర్ 3న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300కి పైగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘డియర్ మేఘ’ మూవీ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు.

Megha Akash, Adith Arun Dear Megha Movie Trailer Released - Sakshi

తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇందులో డైలాగ్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ‘డియర్‌ మేఘ.. నా లైఫ్‌లో ఓ అద్భుతమైన సంఘటన జరిగింది’ కథలకు ముగింపు ఉంటుందేమో కానీ ప్రేమకథలకు ముగింపు ఉండదంటూ హీరో చెప్పే సంభాషణతో ట్రైల‌ర్ మొద‌లైంది. తన ప్రేమను తనలో దాచుకుని బాధపడే ఓ అమ్మాయి కథే డియర్ మేఘ అని ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతోంది. ఇందులో మేఘ ఆకాష్ లుక్స్ ప్రేక్షక్లులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ముక్కోణ‌పు ప్రేమ క‌థ‌లో ఎవ‌రు ఎవ‌రిని ప్రేమించారు? ఎవ‌రి ప్రేమ గెలిచింది వంటి విష‌యాలు సినిమా చూస్తేనే అర్ధ‌మ‌వుతుంది. ఈ సినిమానికి హరి గౌర సంగీతం అందించారు. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు శ్రోతలకు మంచి వినోదాన్ని అందించాయి. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో బాగా అంచనాలు పెరిగాయి.

Megha Akash Dear Megha Official Teaser - Chitrambhalare Flixadda

ఈ సందర్భంగా అరుణ్‌ అదిత్‌ మాట్లాడుతూ– ‘‘2009లో నా కెరీర్‌ ప్రారంభమైంది. తమన్నాగారితో ‘లెవెన్త్‌ అవర్‌’ వెబ్‌సిరీస్‌ చేస్తున్నప్పుడు ‘డియర్‌ మేఘ’కి ఓకే చెప్పాను. ‘‘అమ్మాయి పేరు మీద ‘డియర్‌ మేఘ’ అని టైటిల్‌ పెడుతున్నాం.. నీకు అభ్యంతరం లేదుగా?’’ అని సుశాంత్‌ అడిగారు. ‘నాకు కథే ముఖ్యం.. టైటిల్‌ కాదు’ అని చెప్పాను. హీరోగానే కాదు. నటనకు ఆస్కారం ఉండే ఎలాంటి పాత్రలైనా చేస్తాను. నేను నటించిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’, ‘కథ కంచికి మనం ఇంటికి’ రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు.

Related posts