telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ వల్ల రష్మికకు కొత్త తలనొప్పి

Rashmika-and-Vijay-Devarakonda

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం “డియర్ కామ్రేడ్”. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ ను నాలుగు భాషల్లో విడుదల చేశారు. ఈ టీజర్లో విజయ్, రష్మిక మధ్య వచ్చిన లిప్ లాక్ సీన్ వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ టీజర్ కు 5.5 మిలియన్ల వ్యూస్, 200కే ప్లస్ లైక్స్ వచ్చాయి. యూట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది ఈ టీజర్. ఇక ఈ టీజర్ కు విడుదలైన అన్ని భాషల నుంచి మంచి స్పందన వస్తోంది. కానీ కన్నడ ప్రేక్షకులు కొంతమంది మాత్రం ఈ టీజర్ పై ఫైర్ అవుతున్నారు.

గతంలో రష్మిక కన్నడ హీరో రక్షిత్ ని నిశ్చితార్ధం చేసుకొని, తరువాత పెళ్లి బ్రేకప్ చేసుకుంది. దీంతో అప్పటినుంచీ రక్షిత్ ఫ్యాన్స్ ఆమెపై గుర్రుగా ఉన్నారు. ఇలా ఛాన్స్ వచ్చిన ప్రతిసారీ రష్మికపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు “డియర్ కామ్రేడ్”లో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సీన్ చూసిన రక్షిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. రష్మిక మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. గతంలో “గీతగోవిందం” సినిమాలో కూడా విజయ్, రష్మికల మధ్య లిప్ లాక్ సీన్ ఉండగా… ఇలాగే ట్రోలింగ్ జరిగింది.

Related posts