telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“డియర్ కామ్రేడ్” ట్రైలర్

Dear-Comrade

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్‌  బ్యాన‌ర్స్‌లో రూపొందుతున్న ఎమోష‌న‌ల్ డ్రామా “డియ‌ర్ కామ్రేడ్‌”. “యు ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌” ట్యాగ్ లైన్‌. ఈ  సినిమాను నాలుగు ద‌క్షిణాది భాషలైన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. సామాజిక బాధ్య‌త ఉన్న ఇన్‌టెన్సివ్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మెప్పించ‌నున్నారు. ఈ చిత్రానికి జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్‌ సంగీతం అందిస్తుండ‌గా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ నెల 26వ తేదీన విడుద‌ల‌వుతున్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర‌బృందం తాజాగా విడుద‌ల చేసింది. మూడు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైల‌ర్‌తో క‌థ గురించి ముందే క్లారిటీ ఇచ్చారు. ఇష్ట‌మైన దాని కోసం పోరాటం చేసే యువ‌కుడిగా విజ‌య్ క‌నిపించాడు. “వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్లిపోయేటప్పుడు ఎందుకింత బాధ పెడుతోంది” అంటూ విజ‌య్ చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. అలాగే విజ‌య్‌, రష్మిక మ‌ధ్య లిప్‌లాక్ సీన్లను కూడా ట్రైల‌ర్‌లో చూపించారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts