telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మరో వ్యాక్సిన్ కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్…

corona vacccine covid-19

మన దేశంలో కరోనా కు వ్యాక్సిన్ ఈ ఏడాది ఆరంభం అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం దేశంలో టీకా ఉత్స‌వ్ జ‌రుగుతోన్న స‌మ‌యంలో గుడ్ న్యూస్ చెప్పింది డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ).. కొవాగ్జిన్, కొవీషిల్డ్‌ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండ‌గా.. త్వ‌ర‌లోనే మ‌రో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.. రష్యన్ టీకా స్పుత్నిక్‌-వి.. అత్యవసర వినియోగానికి డీసీజీఐ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.. ఓవైపు దేశంలో టీకాల కొర‌త వేధిస్తున్న స‌మ‌యంలో.. స్ఫుత్నిక్‌కు ఆమోద ముద్ర ప‌డ‌డంతో.. ఆ కొర‌త కొంత మేర తీర‌నుంది.. ఇక‌, రెండు డోస్‌ల స్పుత్నిక్-వీకి ఆమోదం తెలిపిన 60వ దేశంగా భారత్ నిలిచింది. కాగా, రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ భారత్‌లో తయారీకి డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ ఫిబ్రవరి 19న రెడ్డీస్ ల్యాబొరేటరీ దరఖాస్తు చేసుకోగా.. ఇవాళ ఆమోదం ల‌భించింది. అయితే చూడాలి మరి ఈ టీకాను ఉపాయ్ప్గొంచడం ఎప్పటి నుండి ప్రారంభిస్తారు అనేది.

Related posts