telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

అందుకే వార్నర్ కు గాయం అయింది అంటున్న అతని భార్య…

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ గజ్జ గాయంతో భారత్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ వార్నర్ గాయపడ్డాడు. గాయం తీవ్రత దృష్ట్యా అతను మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే వార్నర్ స్ట్రెయిన్ ఇంజ్యూరీపై అతని సతీమణి క్యాండిస్ వార్నర్ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఎక్స్ రేటేడ్ జోక్స్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్‌కు ముందు మారథాన్ సెక్స్ చేసుకోవడంతోనే అతనికి గాయమైందని ఓ రేడియో షోలో సరదాగా చెప్పుకొచ్చింది. ఇక డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2020 సీజన్‌లో పాల్గొనడంతో తాము నాలుగు నెలలు దూరంగా ఉండాల్సి వచ్చిందని క్యాండిస్ వార్నర్ తెలిపింది. భారత్‌తో జరిగిన రెండో వన్డేకు రెండు రోజుల ముందే డేవిడ్‌ను కలిసానని పేర్కొంది. ఇక ఈ మ్యాచ్‌కు ముందు తాము మారథాన్ సెక్స్ చేసుకున్నామని, దాంతోనే వార్నర్‌కు గాయమై ఉండొచ్చని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ‘నాలుగు నెలల తర్వాత మ్యాచ్‌కు రెండు రోజుల ముందే కలుసుకున్నాం. ప్రతీ ఒక్కరు చేసుకునేది చేశాం.’అని మారథన్ సెక్స్ గురించి చెప్పకనే చెప్పింది. ఈ వ్యాఖ్యలకు హోస్ట్ స్పందిస్తూ.. ‘నీ వల్లే వార్నర్‌కు గజ్జలో గాయమైంది. నువ్వు క్రికెట్ ఆస్ట్రేలియాకు తీవ్ర నష్టం చేశావ్’అన్నాడు. దానికి క్యాండిస్ సారీ ఆస్ట్రేలియా అంటూ బదులిచ్చింది. ఇక జోక్స్‌ను పక్కన బెడితే.. ఫస్ట్ టెస్ట్ లోపు వార్నర్ రికవరీ అవుతాడని ఆసీస్ అభిమానులకు క్యాండిస్ హామీ ఇచ్చింది. ‘వార్నర్ గ్రోయిన్ స్ట్రెయిన్‌తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. వైద్యులు పర్యవేక్షణలోనే ఉన్నాడు. భారత్‌తో ఫస్ట్ టెస్ట్‌కు ఇంకా 17 రోజుల సమయం ఉంది. ఆలోపు ఖచ్చితంగా రికవరీ అవుతాడు. వార్నర్ కూడా ఫస్ట్ టెస్ట్ ఆడాలనే కసితోనే ఉన్నాడు.’అని క్యాండిస్ చెప్పుకొచ్చింది.

Related posts