telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రాములో… రాములా…” సాంగ్ కు స్టెప్పేసిన వార్నర్

Warner

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యుడు, విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా పాటలు, డైలాగులతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. ఇటీవల ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ పాటకు తన భార్యతో కలిసి వార్నర్ డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. దాని తర్వాత ‘పోకిరి’ చిత్రంలోని ‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’ అనే డైలాగ్ చెప్పాడు. దానికి ‘పోకిరి’ చిత్రం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సూపర్‌హిట్ సాంగ్‌కు వార్నర్ చిందులేశాడు. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని మరో సూపర్‌హిట్ సాంగ్ ‘రాములో..రాముల…’కు తన ఫ్యామిలీతో కలిసి వార్నర్ చిందులేశాడు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది.

Related posts