telugu navyamedia
news political Telangana

చంద్రబాబు ప్రచారం వల్ల బీజేపీకి లాభమే: దత్తాత్రేయ

BJP Dattatreya comments Jagan

దేశవ్యాప్తంగా చంద్రబాబు పర్యటన చేస్తున్నారని, ఆయన ప్రచారం వల్ల బీజేపీకి లాభమే కానీ నష్టం లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ గాని, ఫెడరల్ ఫ్రంట్ గాని బీజేపీతో సరితూగే పరిస్థితి లేదని పేర్కొన్నారు. తమ పార్టీ 300 పైగా సీట్లు గెల్చుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఏపీలో చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. నిజామాబాద్‌లో ఎంపీ కవిత ఓటమి అంచుల్లో ఉన్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తాయి కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల కోసం హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు.

Related posts

డెడ్ లైన్ దాటలేకపోయిన …. 160 మంది ఆర్టీసీ కార్మికులు..

vimala p

అన్ని శాఖల తరలింపుకు ఏర్పాట్లు .. సచివాలయం కూల్చివేతకు నిర్ణయం!

vimala p

ఏపీలో … ఇంటెలిజెంట్‌ ఎస్‌.ఈ.జెడ్‌…. 700కోట్ల పెట్టుబడులు..

vimala p